Rice Water: రోజూ గంజి తాగితే..?

Hyderabad: గంజిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. పాత కాలంలో ఉద‌యాన్నే ఓ గ్లాసుడు గంజి (rice water) తాగి ప‌నుల‌కు పోయేవారు. ఇప్పుడు గంజి అంటే బ‌ట్ట‌ల కోసం మాత్ర‌మే వాడుతున్నారు కానీ తాగ‌డానికి ఆసక్తి చూపడం లేదు. అస‌లు గంజిని రోజూ తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకుందాం.

*అన్నం ఉడికించిన త‌ర్వాత పైపైన తేలే నీరునే గంజి అంటారు. ఈ గంజి జుట్టుకి, చ‌ర్మానికి, జీర్ణ‌క్రియ‌ను ఎంతో మేలు చేస్తుంద‌ట‌.

*అస‌లు ఈ గంజిని ఎలా త‌యారుచేసుకోవాంటే.. ఒక గిన్నెలో బియ్యం, నీరో పోసి త‌క్కువ మంట‌పై ఉడికించాలి. అన్నం ఉడుకుతున్న స‌మ‌యంలోనే పైన తేలుతున్న నీరును ఒక గిన్నెలో పోసుకోవాలి. అందులో కాస్త ఉప్పు లేదా చెక్క‌ర వేసుకుని తాగితే ఎంతో మంచిది. (rice water)

*గంజి నీరులో విట‌మిన్ బి, ఇనోసిటోల్ పుష్క‌లంగా ఉంటుంది. చ‌ర్మానికి ఎంతో మంచిది. అందుకే చాలా కాస్మెటిక్ కంపెనీలు రైస్ వాట‌ర్‌తోనే ప్రొడ‌క్టుల‌ను త‌యారుచేస్తుంటారు. ముఖ్యంగా కొరియన్ (korean) ప్రొడ‌క్టుల‌న్నీ రైస్ వాట‌ర్‌తో త‌యారుచేసిన‌వే.

*ఈ గంజిలో మిన‌ర‌ల్స్, ప్రో బ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే ఒక గ్లాస్ తాగాక మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న‌వారికి మోష‌న్ సాఫీగా అయిపోతుంది.

*ఇక వేస‌వి కాలంలో రోజూ ఒక గ్లాస్ తాగితే డీహైడ్రేషన్ అనేదే ఉండ‌దు. ఎండ‌కు చ‌ర్మం క‌మిలిపోయి ఉంటే ఈ రైస్ వాట‌ర్‌ని అప్లై చేయండి. వెంట‌నే రిజ‌ల్ట్ క‌నిపిస్తుంది. (rice water)