Health: ఇంట్లో కాలుష్యం.. ఊపిరితిత్తుల‌కు సంకటం

indoor air pollution causing lung cancer

Health:  బ‌య‌ట తిరిగే స‌మ‌యంలో వాయు కాలుష్యాన్ని ర‌క‌రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇంట్లో ఉంటే కాలుష్యం ఎందుకుంటుంది? అన్నీ శుభ్రంగానే ఉంచుకుంటామే? అని అనుకుంటూ ఉంటాం. నిజానికి ఇంట్లోని కాలుష్యం వ‌ల్లే ఈరోజుల్లో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ కేసులు పెరుగుతున్నాయ‌ట‌. ఇందుకు కారణం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ జ‌నాభా ఇంట్లో సాలిడ్ ఇంధ‌నాల‌తో వంట‌లు వండుకుంటున్నార‌ట‌.

సాలిడ్ ఇంధ‌నాల్లో చెక్క‌, ఆవు పేడ పిడ‌క‌లు, బొగ్గు వంటివి వాడుతున్నారు. వీటి వ‌ల్ల ఇంట్లో అత్య‌ధికంగా వాయు కాలుష్యం ఏర్ప‌డుతోంద‌ట‌. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్ర‌కారం.. 2.3 బిలియ‌న్ జ‌నాభా వంట కోసం ఓపెన్ ఫైర్ విధానాలు వాడుతున్నార‌ట‌. దీని వ‌ల్ల 2020 నాటికే 3.2 మిలియ‌న్ మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మృతుల్లో చాలా మ‌టుకు ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నార‌ట‌. 90% కంటే ఎక్కువ సేపు ఇంట్లోనే ఉండేవారికి బ‌య‌టి కాలుష్యం కంటే ఇంట్లో కాలుష్యం వ‌ల్ల క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌ట‌. పొయ్యిలు, సిగ‌రెట్లు త‌దిత‌ర వాటి వ‌ల్ల ఇంట్లో విప‌రీతమైన కాలుష్యం ఏర్ప‌డుతోంద‌ట‌.

మ‌రి దీనికి నివార‌ణ ఏంటి?

ఇంట్లో సోలార్, కరెంట్‌తో ప‌నిచేసే పొయ్యిలు వాడ‌టం.. బ‌యోగ్యాస్, LPG, నేచుర‌ల్ గ్యాస్, పొగ రాని స్ట‌వ్‌లు వాడుకోవ‌డం ఉత్త‌మం.

ఇంటి నిర్మాణాల్లో ఆస్బెస్టోస్ వంటివి వాడ‌క‌పోవ‌డం బెట‌ర్.

ఇంట్లో లేదా ప‌క్కింట్లో నుంచి వ‌చ్చే సిగ‌రెట్ పొగ‌కు చెక్ పెట్ట‌డం.