Brain Power ఇలా పెంచుకోండి
మన బ్రెయిన్ యాక్టివ్‌గా (brain power) ఉంటేనే ఏదైనా ఆలోచించగలుగుతాం.. సాధించగలుగుతాం. ఆ బ్రెయిన్ మొద్దుబారిపోయిందనుకోండి.. లైఫ్‌లో ఫెయిల్ అయిపోయినట్లే. ఎందుకంటే ఆలోచనలు పుట్టేది ముందు బ్రెయిన్‌లోనే కదా..! మరి ఆ బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్‌గా పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
*ఏదైనా సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఐక్యూ లెవెల్స్ పెరగడానికి బ్రెయిన్ పవర్ బూస్ట్ అవ్వడానికి సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం అనేది వరల్డ్‌లోనే నెంబర్ వన్ టెక్నిక్ అని ఓ పరిశోధనలో తేలింది.
*క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే.. ఒత్తిడి తగ్గి బ్రెయిన్ పనితీరు బాగుంటుంది.
*ఏదైనా పుస్తకాన్ని చదవడం ద్వారా కూడా బ్రెయిన్ పవర్ బూస్ట్ అవుతుంది. (brain power)
*కొత్త భాషను నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త విషయం గురించి తెలుసుకునేటప్పుడు ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు రోగాల నుంచి కూడా రక్షిస్తుంది.
*అల్లికలు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏదైనా అల్లేటప్పుడు లేదా కుట్టేటప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్‌గా దానిపైనే ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది. దీనిని కూడా ఐక్యూ బూస్టింగ్ యాక్టివిటీ అంటారు.
*అప్పుడప్పుడూ మనసారా డ్యాన్స్ చేయండి. మీకు నచ్చినట్లుగానే చేయండి. ఇది ఏకాగ్రత్ పెరిగేలా చేస్తుంది. (brain power)