Breakfast: ఇమ్యూనిటీని పెంచే ఇండియ‌న్ బ్రేక్‌ఫాస్ట్

రాత్రి నిద్ర‌పోయాక ఎప్పుడో 8 గంట‌ల త‌ర్వాత ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ (breakfast) చేస్తాం. ఉద‌యం లేవ‌గానే తీసుకునే మొదటి ఆహారం కాబ‌ట్టి దాని నిండా పోష‌కాలు ఉండేలా చూసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటాం. ఇమ్యూనిటీని పెంచే మ‌న ఇండియ‌న్ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఏంటో చూద్దాం.

దోస‌ (dosa)

నాన‌బెట్టిన బియ్యం, మిన‌ప‌ప్పుతో దీనిని చేస్తారు కాబ‌ట్టి ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ ఎక్కువ‌గా ఉంటుంది. దోస‌ను సాంబార్, కొబ్బ‌రి చ‌ట్నీతో తింటే క‌డుపు నిండిన‌ట్లుగా ఉంటుంది. కొబ్బ‌రితో చేసిన చ‌ట్నీ కాబ‌ట్టి ఆరోగ్య‌క‌ర‌మైన ఫ్యాట్స్ కూడా బాడీకి అందుతాయి.

ఇడ్లీ (idly)

భార‌త‌దేశంలో అత్య‌ధికంగా తినే టిఫిన్ల‌లో ఇడ్లీ మొద‌టి స్థానంలో ఉంటుంది. దోస మాదిరిగానే దీని మిశ్ర‌మాన్ని కూడా రాత్రంగా నాన‌బెట్టి రుబ్బి చేస్తారు కాబ‌ట్టి బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిది.

ఉప్మా (upma)

కేవ‌లం ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి, ర‌వ్వ‌తో చేసుకునే ఉప్మా కంటే అందులో క్యారెట్ వంటివి వేసుకుని తింటే ఎంతో మంచిది. (breakfast)

మొల‌క‌ల స‌లాడ్ (sprout salad)

మొల‌కెత్తిన గింజ‌ల‌ను స‌లాడ్‌గా తీసుకున్నా మంచిదే. పొద్దున్నే మొల‌క‌లు తినాంటే ఎవ‌రి వ‌ల్లా కాదు. అందుకే వాటిలో కాస్త ఉల్లిపాయ‌లు, కొద్దిగా చాట్ మ‌సాలా, నిమ్మ‌ర‌సం వేసుకుని తిన‌గ‌లిగేలా ప్రిపేర్ చేసుకుంటే స‌రిపోతుంది.