Kidneys: కిడ్నీలను నేచురల్‌గా బాగుచేయచ్చా?
మన శరీరంలో మూత్రపిండాల (kidneys) పనితీరు అత్యంత కీలకం. కిడ్నీలు బాగుంటేనే గుండె బాగుంటుంది. వాటికి ఏమన్నా అయితే మనిషి కుప్పకూలిపోతాడు. అయితే.. కిడ్నీలు పాడైపోతే వాటిని నేచురల్‌గా బాగు చేసుకునే అవకాశం ఉందా? అది కిడ్నీ వ్యాధి ఏ స్టేజ్‌లో ఉంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో సొంత వైద్యం కాకుండా తప్పకుండా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే మొదటి దశలో.. అంటే కిడ్నీల్లో స్వల్ప సమస్య మొదలైనప్పుడు మనం ఏం తింటున్నామో చూసుకోవడం ఎంతో ముఖ్యం.
*కూరగాయలు, పండ్లు బాగా తీసుకుంటే కిడ్నీల పనితీరు ఎంతో బాగుంటుంది.
*క్యాబేజీలో తక్కువ పొటాషియం ఎక్కువ పీచు ఉంటుంది. కిడ్నీలకు కావాల్సింది కూడా ఇదే. (kidneys)
*అల్లం, పసుపు వాడకం కూడా కిడ్నీలకు ఎంతో మంచిది.
*లీన్ ప్రొటీన్ అంటే స్కిన్లెస్ చికెన్, టోఫు కూడా మంచివే. రెడ్ మీట్‌కి మాత్రం కిడ్నీలు బాగున్నా బాగోకపోయినా దూరంగా ఉండండి.
*సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. సోడియం శాతం ఎంత ఉందో కొలిచే పరికరాలు ఉంటాయి. వాటిని దగ్గరపెట్టుకోండి.
*బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లను తింటూ ఉండండి. (kidneys)
*ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండేవి అస్సలు ముట్టకండి. పాల పదార్థాలు, నట్స్, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
*నీళ్లు తాగడం హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. అయితే మీకు ఉన్న సమస్య ఆధారంగా నీటి శాతాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా డాక్టర్లతో చర్చించాల్సిన అంశం. (kidneys)