Health: ఫోక‌స్ చేయ‌లేక‌పోతున్నారా?

ఏ ప‌ని చేయాల‌న్నా ఫోక‌స్, ఏకాగ్ర‌త అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండూ లేక‌పోతే ఏమీ చేయ‌లేం. చేసినా ఉప‌యోగం ఉండ‌దు (health). ఏకాగ్ర‌త, ఫోక‌స్ పెర‌గ‌డానికి కొన్ని వ్యాయామ‌లు ఉన్నాయి. ఇవి ట్రై చేసి చూడండి.

బ్రీతింగ్ వ్యాయామాలు

బ్రీతింగ్ వ్యాయామాలు ఏకాగ్ర‌త, ఫోక‌స్‌ను పెంచుతాయ‌ట‌. ఉద‌యాన్నే లేచి మీరు చేయ‌గ‌లిగే బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఫోక‌స్, ఏకాగ్ర‌త పెరుగుతాయి. కావాలంటే ఒక వారం ప్ర‌య‌త్నించి చూడండి.

డీప్ బెల్లీ బ్రీతింగ్

ఏకాగ్ర‌త‌ను పెంచే అతి కీల‌క‌మైన బ్రీతింగ్ టెక్నిక్ డీప్ బెల్లీ బ్రీతింగ్. అంటే మీ ఊపిరితిత్తుల‌తో శ్వాస తీసుకుని.. నెమ్మదిగా వ‌ద‌లాలి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు క‌డుపు లోప‌లికి నొక్కుకుపోయిన‌ట్లు క‌నిపించాలి. అప్పుడే ఈ టెక్నిక్ ప‌నిచేస్తుంది.

బాక్స్ బ్రీతింగ్

బాక్స్ బ్రీతింగ్ అంటే.. ఒక బాక్స్‌కి నాలుగు ద‌శ‌లు ఉంటాయి. మ‌నం ఊపిరి తీసుకున్న‌ప్పుడు ఈ నాలుగు ద‌శ‌ల‌ను కౌంట్ చేస్తూ శ్వాస వ‌ద‌లాలి. సింపుల్‌గా చెప్పాలంటే.. నాలుగు సార్లు కౌంట్ చేసుకుంటూ శ్వాస తీసుకోండి.. నాలుగు సార్లు కౌంట్ చేసి ఊపిరి బిగ‌ప‌ట్టండి.. ఆ త‌ర్వాత నాలుగు సార్లు కౌంట్ చేసి ఊపిరి వ‌ద‌లండి. (health)

ముక్కు ద్వారా

ఒక సైడ్ మాత్ర‌మే ముక్కును ప‌ట్టుకుని బ్రీతింగ్ వ్యాయామం చేసినా మంచిదే. దీని వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంది. దీనిని నాడీ శోధ‌న అని కూడా అంటారు.

అనులోమ ప్రాణాయామ‌

దీనిని హ‌త యోగాలో వాడ‌తారు. ఈ టెక్నిక్‌ని ఉద‌యాన్నే చేస్తే ఒత్తిడి త‌గ్గుతుంది. ఫోక‌స్, ఏకాగ్ర‌త పెరుగుతాయి. (health)