Bad Habits ఎలా వదిలించుకోవాలి?
చెడు అలవాట్లను (bad habits) దూరం చేసుకోవడం ఎంతో కష్టమైన పని. కొందరు ఉన్నది ఒక్కటే జిందగీ అన్నట్లు చెడు అలవాట్లతోనే సావాసం చేస్తుంటారు. మరికొందరు ఎలాగైనా మంచి హ్యాబిట్స్ అలవర్చుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటారు. కానీ వారి వల్ల కాదు. అసలు ఒక బ్యాడ్ హ్యాబిట్‌ని ఎలా దూరం చేసుకోవాలి?
అదేంటో గుర్తించండి
మనకు ఏదన్నా చెడు అలవాటు ఉందంటే రోజూ దానివైపే మనసు మళ్లుతుంటుంది. ఏ సమయంలో మనసు దానివైపు వెళ్తోందో గుర్తించడం చాలా ముఖ్యం. అంటే ఒత్తిడిగా ఉన్నప్పుడా? లేక కంగారులో ఉన్నప్పుడా.. లేక కోపంగా ఉన్నప్పుడా అనేది తెలుసుకోవాలి. అప్పుడే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. (bad habits)
రొటీన్‌గా చేస్తున్నారా?
మీకున్న బ్యాడ్ హ్యాబిట్‌ని రొటీన్‌గా చేస్తున్నారా? ఉదాహరణకు అతిగా సోషల్ మీడియా వాడటం మీకున్న బ్యాడ్ హ్యాబిట్ అనుకుందాం. ఇది రోజూ చేస్తుంటే మాత్రం ఆ రోజుకి ఏదైనా ఒక మంచి పనిని ప్లాన్ చేసుకోండి. మనసు ఆ సోషల్ మీడియా వైపు వెళ్లనివ్వకుండా ఉండేలా మీరు ఎంచుకునే పని ఉండాలి.
బ్రెయిన్ ఏం చెప్తోంది?
మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్‌లో సిగరెట్ తాగడం ఉంటే.. ఆ సిగరెట్ తాగుతున్నసేపు మీ బ్రెయిన్ మీకు ఏం చెప్తోందో గమనించండి. అంటే.. మీరు స్మోకింగ్ చేస్తున్నప్పుడు హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే బ్రెయిన్ మీకు ఇస్తున్న రియాక్షన్. సేమ్ అదే హాయిని స్మోకింగ్ కాకుండా ఇంకేదైనా విషయం కూడా ఇస్తుంది. ఆ విషయం ఏంటో తెలుసుకోండి. తెలిస్తే.. స్మోకింగ్‌కి బదులు ఆ మంచి పనిని రీప్లేస్ చేయండి. అంటే.. స్మోకింగ్‌కి బదులు వాకింగ్‌కి వెళ్లండి. మీకు అంతే హాయిగా ఉంటుంది.. అదే విధంగా ఆ బ్యాడ్ హ్యాబిట్‌ని దూరం చేసుకున్నవారూ అవుతారు. (bad habits)