Rice: అన్నం వద్దనుకుంటున్నారా.. అయితే ఇవి తిని చూడండి
Rice: అన్నం తింటే బరువు పెరిగిపోతారు అని భయపడుతుంటారు. నిజానికి అన్నం తింటే బరువు పెరగరు కానీ తిని ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఒకే దగ్గర కూర్చుండిపోతే అప్పుడు బరువు పెరుగుతారు. ఏదేమైనప్పటికీ చాలా మందికి అన్నం అంటే నెగిటివ్ అభిప్రాయం పడిపోయింది. మీరు కూడా ఈ కోవకే చెందినవారైతే అన్నానికి బదులు ఇవి తిని చూడండి.
బ్రౌన్ రైస్ (brown rice)
ఇది అందరికీ తెలిసిందే. అన్నానికి బదులు అందరూ దీనినే తింటున్నారు. తెల్ల అన్నంతో పోలిస్తే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది.
కీన్వా (quinoa)
కీన్వా కూడా మంచి ఆప్షనే. సరిగ్గా ఉడికించుకుని తింటే బాగానే ఉంటుంది. తెల్ల అన్నంతో పోల్చుకుంటే ఇందులో తొమ్మిది రెట్లు ఎక్కువ పీచు ఉంటుంది.
కాలిఫ్లవర్ (cauliflower)
తక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలి అనుకునేవారికి కాలిఫ్లవర్ రైస్ బెస్ట్. ఎక్కువ కాలిఫ్లవర్ ముక్కలు వేసుకుని తెల్ల అన్నంతో చేసుకున్నా బ్యాలెన్స్ అవుతుంది.
ఎర్ర బియ్యం (red rice)
ఇది మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. ఎర్రటి బియ్యం గింజల్లా ఉండే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేరళలో ఈ అన్నాన్ని ఎక్కువగా తింటుంటారు. కాకపోతే మన దగ్గర ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా ఖరీదైనవే. ఎర్రటి బియ్యం కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటుంది.
గోధుమలు (wheat kernels)
గోధుమ నూకను కూడా వండుకుని అన్నంలా తినేయచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్, కేలొరీలు తక్కువగా పీచు ఎక్కువగా ఉంటుంది.