Healthy Breakfast: కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇవి బెస్ట్

Hyderabad: ఈ మ‌ధ్య‌కాలంలో కాలేజ్‌కి వెళ్లే స్టూడెంట్స్ ఉద‌యం పూట బ్రేక్‌ఫాస్ట్ (healthy breakfast) తిన‌కుండా వెళ్లిపోతున్నారు. డైరెక్ట్‌గా లంచ్, స్నాక్స్ అని తినేస్తున్నారు. కానీ రెగ్యుల‌ర్ బ్రేక్‌ఫాస్ట్ వండితే వారికి కూడా తిన‌బుద్ది కాదు. మ‌రి అలాంట‌ప్పుడు ఏం వండాలి?

ఓట్‌మీల్
ఏదో ఒక రకంగా ఓట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో మిక్స్ చేసేలా చూడండి. ఒక ఐదు స్పూన్స్ తిన్నా కూడా క‌డుపు నిండిన‌ట్లు ఉంటుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. (healthy breakfast)

బ్రెడ్, గుడ్లు
బ్రౌన్ బ్రెడ్‌పై ఉడికించిన గుడ్లు, లేదా బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి వేసి పెట్టండి. ఇది తిన‌గానే ఎన‌ర్జీ తన్నుకొస్తుంది. లంచ్ టైంకి మాత్ర‌మే ఆక‌లి వేస్తుంది. దీని వ‌ల్ల బ‌య‌ట దొరికే స్నాక్స్ తిన‌కుండా ఉంటారు.

పండ్లు
ఒక ప్లేట్ నిండా మూడు ర‌కాల పండ్లు కోసి పెట్టండి. కాస్త ఖ‌ర్చుతో కూడుకున్న ప‌నే. మూడు ర‌కాల పండ్లు కుద‌ర‌క‌పోతే ఆ కాలంలో దొరికే ఏ పండు అయినా స‌రే. ఒక ప్లేట్ నిండా పెట్టి ఇవ్వండి. పండ్లలో ఉంటే విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది. (healthy breakfast)