Health: ఫైబర్ ఎక్కువగా కావాలంటే..!
మనం రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ (fiber) ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటాం. కార్బ్స్ కంటే ప్రొటీన్, ఫైబర్ ఉండే ఆహార పదార్థాలకే వ్యాల్యూ ఎక్కువ. అసలు ఫైబర్ కోసం ఎలాంటి ఆహారాలను మన భోజనంలో చేర్చుకోవాలో తెలుసుకుందాం. (health)
*ఉడకబెట్టిన కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. కార్బ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అది షుగర్‌లోకి త్వరగా కన్వర్ట్ అయిపోతుంది. అదే ఫైబర్ ఎక్కువగా ఉండే ఉడకబెట్టిన కూరగాయలను ఒక కప్పు తీసుకున్నారంటే నాలుగు గంటల పాటు పీచు జీర్ణాశయంలోనే ఉంటుంది. త్వరగా ఆకలి కూడా వేయదు.
*దాదాపు అన్ని పండ్లలో తక్కువ కేలొరీలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మనకు సులువుగా దొరికే యాపిల్స్, అరటి పండ్లను ఎక్కువగా తింటూ ఉండటం వల్ల కావాల్సినంత ఫైబర్ శరీరానికి అందుతుంది. స్నాక్స్ టైంలో ఈ పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. (health)
*ఫైబర్ ఉన్న స్నాక్స్‌లో పాప్‌కార్న్ ది బెస్ట్ అనే చెప్పాలి. కాకపోతే మీరు ఇంట్లో తయారుచేసుకుని తింటే మంచిది.
*అన్నం, చపాతీలు కాకుండా ఏదైనా తినాలనిపిస్తే సబ్జా గింజలతో స్మూతీ చేసుకోవచ్చు. ఒక రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకుని అరగంట పాటు నీళల్లో నానబెట్టండి. అవి కాస్త ఉబ్బినట్లుగా అవుతాయి. ఆ తర్వాత రెండు స్పూన్న తేనె వేసుకుని తినండి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
*పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలిసిందే. అయితే రోజూ తినే యాపిల్స్, అరటిలతో బోర్ కొట్టేసింది అనుకోండి.. చక్కగా అవొకాడోలు తెచ్చుకుని తినండి. ఒక్కో అవొకాడోలో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. మెటబాలిజంకి సంబంధించిన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. (health)