Rice: అన్నం తినడం మానేసారా? మీ ఒంట్లో జరిగేదిదే
Rice: బరువు తగ్గాలని మంచి బాడీ పెంచాలని ఇలా ఏదో ఒక కారణంతో అన్నం మానేస్తుంటారు చాలా మంది. అలా అన్నం మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?
తెల్ల అన్నంలో కావాల్సినని మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఒక నెల రోజుల పాటు అన్నం తినడం మానేస్తే శరీరానికి అందాల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ అందక నీరసించిపోతారు. ఫలితంగా ఉన్నట్టుండి తూలి పడిపోవడం.. భరించలేని నీరసం వస్తాయి.
అన్నం మానేస్తే బరువు తగ్గుతారు. ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి. బరువు పెరిగేందుకు ఈ కార్బోహైడ్రేట్సే ముఖ్య కారణం. అలాగని మొత్తానికే మానేయద్దు. మీరు సాధారణంగా తినే దానికి కాస్త తక్కువగా తిని మిగతా ఆహారంలో ఉడికించిన కూరగాయలు, సలాడ్ వంటివి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.
అన్నంలో కాస్త పీచు పదార్థం కూడా ఉంటుంది. కానీ కొత్త బియ్యం కంటే పాత బియ్యంలో ఈ పీచు కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నాన్ని మాత్రం పక్కన పెట్టేయకండి. మీకు ఏమన్నా సందేహం ఉంటే వైద్యులను సంప్రదించి దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకోండి.