International Men’s Day: మీ పార్ట్‌నర్‌కు ఈ కానుక‌లు ఇచ్చి చూడండి..!

International Men’s Day: ఈరోజు అంత‌ర్జాతీయ పురుషుల దినోత్స‌వం. మహిళ‌ల దినోత్స‌వం రోజున ఎన్నో కార్య‌క్ర‌మాలు చేస్తారు. కానీ పురుషుల దినోత్స‌వం అనేది ఎవ్వ‌రికీ గుర్తు ఉండ‌దు. ప్ర‌తీ మ‌గాడి విజ‌యం వెనుక ఒక ఆడ‌ది ఉంటుంది అంటారు. అదే విధంగా ప్ర‌తి ఆడ‌దాని విజ‌యం వెనుక కూడా స‌పోర్ట్ చేసే మ‌గాడు క‌చ్చితంగా ఉంటాడు. అఫ్‌కోర్స్ ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా స‌క్సెస్ అయిన మ‌గ‌వాళ్లు, ఆడ‌వాళ్లు కూడా ఉన్నార‌నుకోండి. అది వేరే విష‌యం. మ‌రి ఈ పురుషుల దినోత్స‌వం సంద‌ర్భంగా మీ పార్ట్‌న‌ర్స్‌కి ఏవైనా గిఫ్ట్స్ ఇవ్వాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఐడియాలు మీకోస‌మే..! పార్ట్‌న‌ర్‌కి మాత్ర‌మే కాదు అన్న‌, త‌మ్ముడు, నాన్న ఇలా ఎవ్వరికైనా ఈ గిఫ్ట్స్ ఇచ్చుకోవ‌చ్చు.

వాలెట్ (wallet)

మ‌గ‌వారికి వాలెట్ క‌లెక్ష‌న్ అంటే ఎంతో ఇష్టం అని ఓ స‌ర్వేలో తేలింది. సో మీ మీరు ఎవ‌రికైతే గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నారో వారికి ఏ రంగు ఇష్ట‌మో అదే రంగులో ఓ వాలెట్‌ను కానుక‌గా ఇవ్వండి.

గ్రూమింగ్ ప్రొడ‌క్ట్స్ (grooming products)

మ‌గ‌వారి కోసం ప్ర‌త్యేకించి గ్రూమింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక మంచి బ్రాండ్ ఎంచుకుని ఒక కాంబో ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేయండి.

ఆల్క‌హాల్ (alcohol)

ఇది కొంచెం ఓవర్ అయిన‌ట్లు అనిపిస్తుంది కానీ ఒకవేళ మీ పార్ట్‌న‌ర్‌కి లిమిట్‌లో తాగే అల‌వాటు ఉంటే త‌న ఫేవ‌రెట్ బ్రాండ్ బాటిల్ కొని ఇవ్వండి (అల‌వాటు లేనప్పుడు అస్స‌లు ఇవ్వ‌కండి)

గ్యాడ్జెట్స్ (gadgets)

గ్యాడ్జెట్స్ ఇష్ట‌ప‌డ‌ని మ‌గ‌వాళ్లు ఉండ‌రు. మీ పార్ట్‌న‌ర్‌కు ఎలాంటి గ్యాడ్జెట్స్ అంటే ఇష్ట‌మో మీకు తెలిస్తే ఒకటి కొని ఇవ్వండి.

మొక్క‌లు (plants)

పైన చెప్పిన‌వి కాకుండా మీరు ఇచ్చే కాకుండా ఎక్కువ కాలం ఉండాలంటే ఒక మొక్క‌ని ఇవ్వండి. దానిని మీ పార్ట్‌న‌ర్ ప‌నిచేసే చోట పెట్టండి.

ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. మీరు కానుక‌లు క‌చ్చితంగా ఇవ్వాల్సిందే అనే నియ‌మం ఏమీ లేదు. వారికి ఒక విషె చెప్పి వారంటే మీకు ఎంత ఇష్ట‌మో చెప్పినా అదే వారికి ఎంతో విలువైన కానుక‌. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మ‌గ‌వారికి NEWSX త‌ర‌ఫు నుంచి పురుషుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.