Blood Test: ఈ బ్లడ్ టెస్ట్ ఒక గేమ్ ఛేంజర్
Blood Test: మన శరీరంలోని చాలా మటుకు రోగాలు బ్లడ్ టెస్ట్ ద్వారానే బయటపడతాయి. మనం చాలా బ్లడ్ టెస్ట్‌ల గురించి వినే ఉంటాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్లడ్ టెస్ట్ మాత్రం గేమ్ ఛేంజర్ లాంటిది. ఇది చేయించుకుంటే చాలు 12 రకాల క్యాన్సర్లను ముందే పసిగట్టేస్తుంది. దీనికి సంబంధించిన యూకే ప్రభుత్వం త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం తీసుకోనుంది. ఈ బ్లడ్ టెస్ట్ కోవిడ్ సమయంలో చేసిన PCR టెస్ట్ లాగే ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్‌కి సంబంధించిన రీసెర్చ్ కోసం యూకే ప్రభుత్వానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ ఏకంగా 3.28 మిలియన్ డాలర్ల ఫండ్స్ ఇచ్చింది.
ఈ గేమ్ ఛేంజింగ్ బ్లడ్ టెస్ట్ మరో ఐదేళ్లలో మనకు అందుబాటులోకి వస్తుంది. ఊపిరితిత్తులు, బ్రెస్ట్, ప్రోస్టేట్‌తో పాటు ఇతర రకాల క్యాన్సర్లను ముందే పసిగడుతుంది. ఇది చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి 157 డాలర్లు ఖర్చు అవుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా అనవసరపు డయాగ్నసిస్, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ముందుగా చికిత్స తీసుకుంటారు కాబట్టి మరణాల సంఖ్య తగ్గుతుంది. ఎక్స్ జెనెరా అనే స్టార్టప్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్‌లు చేయడం స్టార్ట్ చేస్తుంది. యూకేలో ఏడాదికి 320,000 మంది ఏదో ఒక రకమైన క్యాన్సర్ల బారిన పడుతున్నారు. కోవిడ్ వల్ల ఒక్క సంవత్సరంలోనే 40,000 మందికి క్యాన్సర్లు ఉన్నట్లు గుర్తించలేకపోయారు. రానున్న ఏళ్లల్లో క్యాన్సర్ మరణాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని యూకే ప్రభుత్వం ఆశిస్తోంది.