Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడని పండ్లు
Hyderabad: ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్(breaksfast) చేయడం ఎంత ముఖ్యమో.. అందులోకి ఏం తింటున్నామో చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పొద్దున్నే పండ్లు(fruits) తింటే ఎనర్జీ లెవల్స్ బాగుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని తినకూడని పండ్లు కూడా ఉన్నాయి.
నారింజ (Orange)
సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజ పండ్లు హెల్త్‌కి మంచివే కానీ.. బ్రేక్‌ఫాస్ట్ టైంలో మాత్రం అస్సలు తినకండి. అందులో ఉండే సిట్రస్ వల్ల కడుపులో యాసిడ్ ఫాం అవుతుంది. దాని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
అరటిపండ్లు (Banana)
అరటిలో మెగ్నీషియం, పొటాషియం దండుగా ఉంటాయి. అయితే అరటిపండ్లని ఓట్స్‌లో కానీ.. బ్రౌన్ బ్రెడ్‌లో కానీ కలిపి తింటే మంచిది. కానీ పరగడుపున తింటే మాత్రం బ్లడ్‌లో మెగ్నీషియం, పొటాషియం లెవల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి.
గ్రేప్ ఫ్రూట్ (Grape fruit)
అంటే ఇది ద్రాక్ష కాదండోయ్. నిమ్మ, నారింజ సుగుణాలతో కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ టైంలో ఇది తింటే కడుపంతా మంటగా ఉంటుంది. రోజంతా ఇరిటేషన్‌తో నిండిపోతుంది.
పుచ్చకాయ (Watermelon)
పుచ్చకాయల్లో 90% నీరే ఉంటుంది. తినగానే సులువుగా అరిగిపోతుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే తిన్న గంటకే విపరీతమైన ఆకలి వేస్తుంది.
స్ట్రాబెర్రీ (strawberry)
స్ట్రాబెర్రీలు పుల్లగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
మామిడి పండ్లు (Mangoes)
మామిడి పండ్లలో సహజంగానే షుగర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే తింటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
ద్రాక్ష (Grapes)
ద్రాక్షలో క్యాలొరీలు విపరీతంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలనుకుంటే ఓ చిన్న కప్పుకి తినడం బెటర్. అంతకంటే ఎక్కువ తింటే మాత్రం అది షుగర్‌గా మారి వెంటనే ఫ్యాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది.