Health: తక్కువ తిన్నా కడుపు నిండిపోవాలంటే….
తక్కువ తిన్నా కడుపు నిండిపోతే ఎంతో మంచిది (health). అప్పుడు ఎక్కువగా తినేయకుండా ఉంటాం. బరువూ పెరగరు. మరి అలా తక్కువ తిన్నా కడుపు నిండిపోవాలంటే ఎలాంటి ఆహారాలు తినాలి?
ప్రొటీన్ (protein)
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే కొద్దిగా తిన్నా కడుపు నిండిపోతుంది. చిక్కుడు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇవి తిన్నాక కడుపు త్వరగా నిండిపోయిన భావన కలగడమే కాదు కండరాలు కూడా దృఢమవుతాయి.
పీచు (fibre)
పీచు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముడి ధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది తింటే ఉదయాన్నే ఎలాంటి ఇబ్బంది లేకుండా మల విసర్జన సాఫీగా సాగుతుంది. మీరు ఉదయాన్నే మల విసర్జన సరిగ్గా జరగకపోతే మీరు ఎంత తిన్నా వేస్టే.
ఆరోగ్యకరమైన కొవ్వులు (healthy fats)
కొవ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. హెల్తీ.. అన్‌హెల్తీ ఫ్యాట్స్. హెల్తీ ఫ్యాట్స్ మనకు మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, అవొకాడో, ఆలివ్ ఆయిల్‌లో హెల్తీ కొవ్వు ఉంటుంది.
నీళ్లు (water)
భోజనం చేయడానికి ఒక గంట ముందు నీళ్లు తాగి చూడండి. కొన్ని సార్లు నీరు సరిగ్గా అందకపోయినా ఆకలి వేస్తున్నట్లు ఉంటుంది. వేళకాని వేళల్లో ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తే రెండు గ్లాసుల నీళ్లు తాగి చూడండి.
నెమ్మదిగా తినండి (slow eating)
మీరు ఏం తిన్నా కూడా దానిని ఎలా ఎలా తింటున్నారో కూడా గమనించుకోవాలి. బాగా నమిలి మింగండి. నెమ్మదిగా తినడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది.