Bloating: 30 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కే ఈ స‌మ‌స్య వ‌స్తుందా?

Bloating: మ‌గ‌, ఆడ అనే తేడా లేకుండా అంద‌రినీ వేధించే స‌మ‌స్య బ్లోటింగ్. దీనిని తెలుగులో క‌డుపు ఉబ్బ‌రం అని అంటారు. మీరు తిన్నా తిన‌క‌పోయినా క‌డుపు ఉబ్బిన‌ట్లు ఎప్పుడైనా అనిపించిందా? దానినే బ్లోటింగ్ అంటారు. ఈ బ్లోటింగ్ ఎంత ఇరిటేష‌న్‌గా ఉంటుందంటే.. క‌డుపు ఖాళీగా ఉన్నా కూడా ఏదో కొవ్వు పెరిగిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ బ్లోటింగ్ స‌మ‌స్య మ‌గ‌వారి కంటే ఆడ‌వారిలో ఎక్కువ‌గా కనిపిస్తుంటుంది. అది కూడా 30 ఏళ్లు దాటిన ఆడ‌వారిలో.

ఈ బ్లోటింగ్ స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది?

స‌రైన తిండి తిన‌కుండా జంక్ ఫుడ్ తిన‌డం, హార్మోన‌ల్ ఇమ్‌బ్యాలెన్స్ వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఇక పీరియ‌డ్స్ స‌మ‌యంలో పొట్ట‌లో నీరు చేరిపోవ‌డం వ‌ల్ల కూడా బ్లోటింగ్ స‌మ‌స్య వ‌స్తుంది. ఆడ‌వారికి వ‌య‌సు పెరుగుతోంది అంటే దాన‌ర్థం త్వ‌ర‌లో వారు మెనోపాజ్ ద‌శ‌లోకి వెళ్తున్నార‌ని. ఆ స‌మ‌యంలో ఓవ‌రీలు త‌క్కువ ఈస్ట్రోజెన్ విడుద‌ల చేస్తాయి. దీనినే హార్మోన‌ల్ ఇమ్‌బ్యాలెన్స్ అంటాం. దీని వ‌ల్ల క‌డుపులో ఉండే మంచి బ్యాక్టీరియా శ‌రీరంలోని ఫ్లూయిడ్స్‌పై ప్ర‌భావం చూపుతుంది. ఫ‌లితంగా నీరు చేరిపోయి బ్లోటింగ్ స‌మ‌స్య వ‌స్తుంది.

ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

వ‌య‌సుకు సంబంధించిన అంశాల‌ను కంట్రోల్ చేయ‌లేం. కాక‌పోతే మంచి పోష‌కాహారం, ఈస్ట్రోజెన్ లెవెన్స్ పెంచే ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ముఖ్యంగా శారీర‌క శ్ర‌మ ఎంతో అవ‌స‌రం. మీకు మ‌రిన్ని అనుమానాలు ఉంటే ఒక‌సారి వైద్యుల‌ను సంప్ర‌దించి మంచి డైట్ పాటించండి చాలు.