Pomegranate: తొక్కే కదా అని పారేయకండి
దానిమ్మ పండు (pomegranate) గింజల్ని మత్రమే తింటారని తెలుసు కానీ దాని తొక్క వల్ల కలిగే ఉపయోగాలు చాలా మందికి తెలీదు. అసలు దానిమ్మ తొక్క ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
దానిమ్మ తొక్కలు యాక్నేని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. తొక్కను ఎండబెట్టి పొడి చేసి ముఖానికి పట్టిస్తే మొటిమలు, దద్దర్లు, యాక్నే రాకుండా ఉంటాయి. వచ్చినా తగ్గిపోతాయి. శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని సులువుగా వెళ్లగొడతుంది. దానిమ్మ తొక్క చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గానూ ఉపయోగపడుతుంది. (pomegranate)
తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కూడా రక్షిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి కూడా ఇది అమృతంలా పనిచేస్తుంది. తొక్కను ఎండబెట్టి పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదను పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎముకలు బలపడతాయి. ఈ తొక్కను టూత్ పౌడర్, టూత్ పేస్ట్‌లలో కూడా వాడతారట. (pomegranate)
ఎలా వాడాలి?
పండును శుభ్రంగా కడిగి నాలుగు భాగాలుగా కోసి ముందు గింజలు తీసేయండి. ఆ తర్వాత ఎక్కడా కూడా గింజ లేకుండా మరోసారి శుభ్రంగా కడగండి. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి పొడి చేసుకుని జల్లెడ పట్టండి. మెత్తటి పొడిలా వచ్చాక ఒక గాజు సీసాలో పెట్టుకోండి. బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ ఏదైనా మనం చేసుకుని వాడుకుంటేనే బెస్ట్ కదా..! (pomegranate)