Covid: పెరిగిపోతున్న కేసులు.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Covid: కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ JN.1 రోజురోజుకీ విజృంభించేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలకు ఈ వేరియంట్ రిస్కీగా మారింది. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.
*పిల్లల్ని ఆడుకోవడానికి అస్సలు బయటికి పంపించకండి. కావాలంటే వారి కోసం ఇంట్లోనే ఆడుకునే విధంగా ఏర్పాటు చేయండి.
*రెండేళ్ల వయసు పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు వేయాల్సిందే.
*ఎప్పటికప్పుడు పిల్లల చేత చేతులు కడిగించండి. వారికి తెలీకుండానే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తుంటారు.
*దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు తీసుకెళ్లండి.
*వారికి ఆహారాన్ని కూడా కాస్త వేడిగా ఉన్నవే పెడుతూ ఉండండి. ఉదయం చేసినవి సాయంత్రం పెట్టకపోవడం మంచిది.
*వారి చేత చిన్న చిన్న వ్యాయామాలు చేయించండి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. వారికి కూడా ఏదో కొత్త ఆట నేర్చుకున్నట్లు ఉంటుంది.
*ఇంట్లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది. పిల్లలకు సపరేట్ గదులు ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.