2050 నాటికి మ‌గ‌వారిలో 84% పెర‌గ‌నున్న క్యాన్స‌ర్ కేసులు

cancer cases in men to raise 90 percent by 2050

Cancer: 2050 నాటికి మ‌గ‌వారిలో 84 శాతం మేర క్యాన్స‌ర్ కేసులు పెర‌గ‌నున్నాయ‌ట‌. 93 శాతం మేర మ‌ర‌ణ కేసులు పెర‌గ‌నున్నాయి. 2022 నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు 10.3 మిలియ‌న్ పెరిగాయి. 2050 నాటికి ఈ కేసులు 19 మిలియ‌న్‌కు చేరుతాయ‌ట‌. క్యాన్స‌ర్ కేసుల కంటే మ‌ర‌ణాల సంఖ్య మ‌రీ ఎక్కువ ఉంటుంది. 65 ఏళ్లు పైబ‌డిన వారిలో క్యాన్స‌ర్ కేసులు 117 శాతానికి పెర‌గ‌నున్నాయి. క్యాన్స‌ర్ రాకుండా మ‌నవంతు మ‌నం ఏమ‌న్నా చేయ‌గ‌లం అంటే అది ధూమ‌పానం, ఆల్క‌హాల్, వాయు కాలుష్యానికి దూరంగా ఉండ‌ట‌మే. ఇక మిగ‌తాదంతా దేవుడి ద‌య అనుకోవాలి. భ‌విష్య‌త్తులో హెల్త్‌కేర్ రంగాన్ని మ‌రింత బలోపేతం చేసేందుకు జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు కృషి చేయాల‌ని..అలాగైతేనే క్యాన్స‌ర్ కేసుల‌ను కొంత‌వ‌రకైనా న‌యం చేయ‌గ‌లం అని పరిశోధ‌కులు చెప్తున్నారు.