Breakfast తినకపోతే క్యాన్సర్లు వస్తాయా?
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ (breakfast) ఎంతో ముఖ్యం. రాత్రంతా నిద్రలో ఉంటాం కాబట్టి దాదాపు 9 గంటల పాటు నిద్రపోయాక ఉదయాన్నే మలవిసర్జన అయిపోతుంది కాబట్టి కడుపు ఖాళీ అయిపోతుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. ఎవరైతే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయరో వారికి భవిష్యత్తులో కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఖాళీ కడుపుతో ఉంటే.. గ్లూకోస్ లెవల్స్‌లో అవకతవకలు జరిగి ఇన్‌ఫ్లమేషన్ తీవ్రం అవుతుంది. క్రమంగా ఇది లివర్, గాల్ బ్లాడర్, ఈసోఫాగల్ క్యాన్సర్లకు దారి తీస్తుంది. 63000 మందిపై నిర్వహించిన ఈ రీసెర్చ్‌లో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినని వారిలో గ్యాస్ట్రో ఇంటెస్టైలన్ క్యాన్సర్ ముప్పు ఉందని తేలింది. (breakfast)
ఆహారం తింటే కేవలం మన శరీరానికి కావాల్సిన శక్తే కాదు మెటబాలిజంపై కూడా దాని ప్రభావం ఉంటుంది. రోజులో మూడు చిన్న మీల్స్, మూడు పెద్ద మీల్స్ తీసుకోవాలట. అయితే ఇది అందరికీ వర్తించదు. బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఇప్పటికిప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయని కాదు. వయసు పెరిగే కొద్ది దాని ప్రభావం ముందు ముందు చాలా ఉంటుంది.
లేచిన వెంటనే తినకపోతే ఏం జరుగుతుంది?
నీరసంగా ఉంటుంది. తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత డయాబెటిక్స్‌కి కూడా దారి తీయచ్చు.
మెటబాలిజం నెమ్మదిస్తుంది.
ఒత్తిడి హార్మోన్లు పెరిగిపోయి కార్టిసాల్ లెవెల్స్ పడిపోతాయి. (breakfast)
ఉదయం తినకుండా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తింటే ఆకలికి ఎక్కువ కేలొరీలు ఉన్న ఆహారం తినేస్తారు. అది ఇంకా ప్రమాదకరం.
జుట్టు రాలిపోయే ప్రమాదమూ ఉంది.
గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు. ఫోకస్ చేయలేరు.
ఇమ్యూనిటీ పెంచే కణాలపై ప్రభావం చూపుతుంది.
అందుకే ఉదయాన్నే ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నారంటే మీరు సాయంత్రం వరకు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదో ఒకటి తినాలి కదా అని తినేయకూడదు. ఏం తింటున్నారు.. ఎంత శాతం తింటున్నారు అనేది ఎంతో ముఖ్యం. (breakfast)