Castor Oil: ఆముదంతో కళ్ల సమస్యలు తగ్గుతాయా?
ఆముదాన్ని కళ్ల చుట్టూ.. కను రెప్పల చుట్టూ రాస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తుంటారు (castor oil). ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆముదంతో కంటి శుక్లాలను కూడా తగ్గించవచ్చని మరికొందరి వాదన. అసలు ఆముదాన్ని కళ్లకు వాడచ్చో లేదో తెలుసుకుందాం. ఆముదం అనే కాదు ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. ఎందుకంటే ఇది కళ్లకు సంబంధించిన అంశం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కళ్లకు ఏదన్నా జరిగితే చూపు పోతుంది.
డాక్టర్లు ఏమంటున్నారంటే.. కళ్ల చుట్టూ ఆముదం రాయడం వల్ల.. లేదా కళ్లల్లో ఒక చుక్క ఆముదం వేసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి అనుకోవడం పూర్తిగా భ్రమేనని అంటున్నారు. ఆముదంతో కంటి సమస్యలు రావు అని నిరూపించేందుకు ఇప్పటివరకు ఎలాంటి సైంటిఫిక్ పరిశోధనలు లేవని చెప్తున్నారు. అలాగని ఆముదం మంచిది కాదు అని కూడా చెప్పడంలేదు. ఆముదంలో రైసినోలిక్ యాసిడ్, ఇతర ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కళ్లు పొడిబారడం వంటి సమస్యలను తగ్గేలా చేస్తుందని అంటున్నారు. కాకపోతే ఆముదాన్ని కళ్లకు వాడే ముందు ఒకసారి కచ్చితంగా వైద్యులను కలిసి సలహా తీసుకోవడం మంచిది. (castor oil)