Water: 8 గ్లాసులే తాగాలా?
ఒకపూట తిండి లేకపోయినా తట్టుకుంటాం కానీ నీళ్లు (water) లేకుండా బతకలేం. మన శరీరంలో రక్తం, ప్లాస్మాతో కలిపి 70% నీరే ఉంటుందట. మంచి నీళ్లు బాగా తాగితే చాలా మటుకు అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూడచ్చు. చాలా మంది రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలని చెప్తుంటారు. ఈ లెక్క ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారికి వర్తిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేని వారికి వర్తిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్లు ఎంత శాతం నీరు తీసుకోవాలో చెప్తారు. కాబట్టి కనిపించినవారికి 8 గ్లాసుల నీళ్లు తాగండి అని ఉచిత సలహాలు ఇవ్వకపోవడం మంచిది. (water)
నిజానికి అన్ని గ్లాసులు ఇన్ని గ్లాసులు అనే లిమిట్ ఏమీ లేదు. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీరు తాగాలి. ఆ తర్వాత రోజులో మీకు ఎన్ని సార్లు దాహం వేస్తే అన్ని సార్లు తాగండి. ఇదే కరెక్ట్ పద్ధతి. అంతేకానీ 8 గ్లాసులు అని చెప్తున్నారు కదా అని అన్ని గ్లాసుల నీరు మాత్రమే తాగి దాహం వేసినప్పుడు తాగకుండా 8 గ్లాసులు తాగేసాం కదా అని అస్సలు అనుకోవద్దు. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం నీటి మీదే ఆధారపడకూడదు. మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలకం. మంచి తిండి తింటూ నీరు తాగుతూ సరైన స్కిన్ కేర్ ప్రొడక్టులు వాడామంటే 40 ఏళ్ల వయసులో కూడా ముడతలు రాకుండా చూసుకోవచ్చు. (water)
మన చర్మం బిగుతుగా ముడతలు లేకుండా ఉండాలంటే కొలాజెన్ అనే ప్రొటీన్ ఎంతో ముఖ్యం. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎంతో కీలకం. సాల్మన్ చేపలు, సబ్జా గింజలు, వాల్నట్స్ తీసుకుంటే కొలాజెన్ పుష్కలంగా అందుతుంది. లేదంటే కొలాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. కాకపోతే ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలన్నా ముందు వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి. ఎందుకంటే అవి మనకు అవసరమో కాదో మనకు తెలీదు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఎంత తీసుకోవాలో చెప్తారు. (water)