Health: ఖాళీ కడుపుతో వాకింగ్.. ఎన్ని లాభాలో!
Health: ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఏదో ఒకటి తినేసి వాకింగ్‌కి వెళ్తుంటారు. అలా కాకుండా ఖాళీ కడుపుతో అరగంట పాటు వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
*కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అరగంట పాటు వాకింగ్ చేస్తే కొవ్వు వేగంగా కరిగిపోతుంది. దీనినే ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటారు.
*ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది. దీని వల్ల మనం తినే తిండిలోని పోషకాలను మన శరీరం సమానంగా గ్రహించుకోగలుగుతుంది. మెటబాలిజం బాగుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. (health)
*ఇన్సులిన్ స్థాయులు కంట్రోల్‌లో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది.
*ఉదయం పూట ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో వాకింగ్ చేస్తున్నప్పుడు మైండ్ కూడా క్లియర్‌గా ఉంటుంది.
*గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌ల రిస్క్ తగ్గుతుంది.
*అరుగుదల బాలేకపోవడం, బ్లోటింగ్ సమస్యలు ఉండవు. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు కడుపులోని కండరాలు కూడా కదులుతాయి. ఫలితంగా జీర్ణ ప్రక్రియ బాగుంటుంది.
ఉదయం పూట వాకింగ్ చేసేటప్పుడు ఈ అంశాలు గుర్తుంచుకోండి
*బాగా నీళ్లు తాగి నడవండి. లేదంటే డీహైడ్రేషన్ అవుతుంది. కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒక బాటిల్ నీళ్లు తాగి వాకింగ్‌కి వెళ్లండి.
*నడిచేందుకు వీలుగా ఉండే షూస్ వేసుకోండి. మీరు గడ్డిపై చేస్తున్నట్లైతే చెప్పులు, బూట్లు లేకుండా నడవండి. ఇది ఇంకా మంచిది. రక్త ప్రసరణ బాగుంటుంది.
*మీ నడుము భాగం నిటారుగా ఉండాలి. ఎలా పడితే అలా నడవకూడదు. మీ భుజాలు రిలాక్సింగ్ పొజిషన్‌లో ఉంచాలి.
*ముందు నెమ్మదిగా వాకింగ్ మొదలుపెట్టండి. ఆ తర్వాత కాస్త వేగాన్ని పెంచుతూ వెళ్లండి. ఎంత వరకు వేగాన్ని తట్టుకోగలరో అంత వరకు మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
గమనిక: బీపీ, షుగర్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వాకింగ్ ప్రక్రియను ప్రారంభించాలనుకుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందే.