Okra: బెండ‌కాయ తిన‌డం లేదా?

బెండ‌కాయ‌లు (okra) తింటే లెక్క‌లు బాగా వ‌స్తాయ‌ని చెప్పేవారు మ‌న పెద్ద‌లు. లెక్క‌లు వ‌స్తాయో లేదో తెలీదు కానీ బెండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని పోష‌కాలు పుష్క‌లంగా అందుతాయి.

*బెండ‌కాయ‌ల్లో కేలొరీలు చాలా త‌క్కువగా ఉంటాయి. కావాల్సిన అన్ని విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబ‌ర్ బాగా ఉంటుంది.

*వండేట‌ప్పుడు జిగురుగా ఉంటుంది అనుకుని తినకుండే ఉండేవారున్నారు. నిజానికి జిగురుతో ఉన్న కూర‌గాయ‌లు ఎంతో మేలు చేస్తాయి. వారంలో మూడు నాలుగు సార్లు బెండ‌కాయ‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌క స‌మ‌స్య‌పోతుంది. (okra)

*ఇందులో ఉండే ఫైబ‌ర్ గుండె ర‌క్త‌నాళాల్లో పూడిక‌లు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది.

*మ‌ధుమేహుల‌కు బెండ‌కాయ ఎంతో మంచిది. పీచు ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి నిదానంగా అరుగుతుంది.

*కీళ్ల‌వాతం రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో క్వ‌సెర్టిన్, ర్యూటిన్ అనే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీలు ఉంటాయి. (okra)