Ice Massage: ముఖానికి ఐస్ ముక్కలు పెడితే?
Hyderabad: ముఖానికి ఐస్ క్యూబ్స్‌తో ఫేషియల్ (ice massage) చేసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాస్త జాగ్రత్తగా టెక్నిక్‌తో ఐస్ మసాజ్ చేసుకుంటే ఫేస్‌లో గ్లో వచ్చేస్తుంది. ఐస్ మసాజ్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఉదయం లేవగానే ముఖం అంతా వాచిపోయినట్లు ఉంటుంది. ఆ వాపు తగ్గాలంటే ఐస్ క్యూబ్‌ను (ice facial) ముఖానికి రాయండి. కాకపోతే నేరుగా పెట్టడం కంటే మస్లిన్ క్లాత్‌లో చుట్టి పెట్టడం మంచిది. ఒకవేళ నేరుగా పెట్టాలన్నా ఎక్కువ సేపు ఉంచకండి. ఐస్ మసాజ్ (ice massage) వల్ల ముఖానికి రక్త ప్రసరణ (blood circulation) బాగా జరుగుతుంది.
ముఖం టైట్‌గా మారుతుంది. పోర్స్ మూసుకుపోతాయి. అప్పుడే ఫేషియల్ చేసినట్లు ఫేస్‌లో గ్లో వస్తుంది. పార్లర్‌కు వెళ్లి వేలకు వేలు పోసి ఫేషియల్స్ చేసుకోవడం కంటే ఈ ఐస్ మసాజ్ చేసుకుని మీరే చేతులతో కాసేపు మర్దనా చేసుకోండి. యాక్నే పింపుల్స్ ఉంటే రెడ్నెస్ తగ్గిస్తుంది. పింపుల్ వల్ల కలిగే నొప్పి కూడా క్రమంగా తగ్గిపోతుంది.
తలనొప్పి ఉంటే ఐస్ క్యూబ్‌ను నుదుటిపై అటు ఇటు రుద్దండి. ఐస్ పెట్టడం వల్ల చలనం తగ్గి క్రమంగా నొప్పి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. మేకప్ వేసుకునే అలవాటు ఉంటే.. ముందు ఐస్ క్యూబ్‌తో ఫేస్ మసాజ్ చేసుకోండి. దాని వల్ల మేకప్ అంతా అయ్యాక కేకీగా అనిపించదు. పైగా మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది.