Milk: రోజూ గ్లాసు పాలు.. ఎంతో మేలు..!
Hyderabad: ఈ మధ్యకాలంలో పాలు (milk) తాగేవారి సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి. వర్క్ పరంగా చూసుకుంటే పాలు తాగితే నిద్ర వచ్చేస్తుందని చాలా మంది కాఫీ, టీ తాగేస్తుంటారు. కానీ రోజూ గ్లాసు పాలు తాగితే ఎంత మంచిదో తెలుసా? కాకపోతే రాత్రిళ్లు పడుకునే ముందు తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఆయుర్వేదం ప్రకారం పాలు ఇచ్చే కొన్ని రకాల పోషకాలు మరే ఆహారం ఇవ్వలేవట. ఇప్పుడంటే అన్నీ కల్తీ అయిపోయి పాలను కూడా కల్తీగా అమ్మేస్తున్నారు. కుదిరితే కాస్త డబ్బు ఎక్కువైనా ఫర్వాలేదు యూరియా, ఇతర కల్తీ పదార్థాలు కలపని పాలనే కొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పాలల్లో ఉండే విటమిన్ డి, బి ఉండటం వల్ల శరీరం కాల్షియంను సులువగా గ్రహించుకోగలుగుతుంది. ఇక పాలల్లో లాక్టోస్ ఉంటుంది కాబట్టి ఒంటికి కావాల్సిన ప్రొటీన్, ఎనర్జీ లభిస్తుంది. (milk)
పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పళ్లు, చిగుళ్లు దృఢంగా మారతాయి. చాలా రకాల రోగాలను ఎదుర్కొనే శక్తి పాలకు ఉంది. పాలల్లో చెక్కర కానీ ఎలాంటి యాడెడ్ షుగర్స్ వేసుకోకుండా తాగితే ఆకలిని తగ్గిస్తుంది. ఇది ఊబకాయం ఉన్నవారికి ఎంతో మేలు. ఇందులో ఉండే పెప్టైడ్ హార్మోన్ కడుపు నిండిన ఫీలింగ్‌ని కలిగేలా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే బాడీ, మైండ్ రిలాక్స్ అయినట్లు ఉంటాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను కలిగించే మెలాటొనిన్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. కొన్ని రకాల రీసెర్చ్‌ల ప్రకారం లో ఫ్యాట్, లేదా ఫ్యాట్ లేని పాలు తాగితే గుండె సంబంధిత సమస్యలు కూడా రావు. (milk)
మన గట్ అంటే జీర్ణాశయం మనకు మరో బ్రెయిన్ లాంటిది. జీర్ణ ప్రక్రియ బాగుంటే మన మైండ్ కూడా బాగుంటుంది. పాలు సులువుగా డైజెస్ట్ అవడంలో తోడ్పడతాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. వ్యాయామం చేసాక ఒక గ్లాసు పాలు తాగితే ఎంతో మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ప్రొటీన్ కండరాలు బలపర్చడానికి తోడ్పడుతుంది. డీహైడ్రేషన్‌లా అనిపించినప్పుడు నీళ్లతో పాటు ఒక గ్లాసు పాలు తాగి చూడండి. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. (milk)