Green Chilly: పచ్చి మిర్చి అంత మంచిదా?
Hyderabad: మిర్చి పేరు వినగానే కారం ఏ రేంజ్‌లో ఉంటుందో తినకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. కొందరు వంటల్లో ఉండే మిర్చిని తీసేస్తారు. ఇంకొందరైతే లంచ్‌లో పక్కన ఓ మిర్చి పెట్టుకుని ఉల్లిపాయలాగా వాడేస్తుంటారు. అసలు పచ్చి మిర్చిని అలా తినచ్చా? (green chilly)
*పచ్చి మిర్చిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్స్, పీచు, షుగర్, ఐరన్, కాల్షియం ఉన్నాయి.
*వీటిని తరచూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు రావట (green chilly)
*ఎనీమియా రాకుండా చేస్తుంది. ఒంట్లో హెమొగ్లోబిన్ లెవల్స్ పడిపోవడం, ఐరన్ లోపించడం వల్ల ఎనీమియా వస్తుంది. పచ్చి మిర్చి తింటే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట.
*ఇందులో విటమిన్ సి, ఈ కూడా పుష్కలంగా ఉంటాయి. దాని వల్ల చర్మం కూడా మెరుస్తుంది.
*ఇందులో క్యాప్సేసిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఒంట్లో వేడిని పుట్టించి మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుందట. దాని వల్ల ఒంట్లో కొవ్వు కూడా కరిగిపోతుంది.
*బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువగా పచ్చి మిర్చి తినేవారిలో డయాబెటిస్ సమస్య కూడా ఉండదట. (green chilly)