Copper: మెట‌ల్ మాత్ర‌మే కాదు..అంత‌కుమించి!

Hyderabad: స్టీల్ గ్లాసుల్లో, సాదా సీదా వాట‌ర్ బాటిల్స్‌లో కంటే రాగి (copper) చెంబుల్లో, సీసాల్లో పోసుకుని తాగడం ఎంతో మేల‌ని ఎప్ప‌టినుంచో మ‌న పెద్ద‌లు, డాక్ట‌ర్లు చెప్తున్నారు. రాగి గ్లాసు నుంచి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది? రోజూ తాగచ్చా? వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

రాగి అంటే ఒక మెట‌ల్ మాత్ర‌మే అనుకుంటారు చాలా మంది. కానీ ఇది మ‌న శ‌రీరానికి కావాల్సిన ఒక విట‌మిన్ లాంటిదే అని చెప్పాలి. ఈ కాప‌ర్ (copper) అనేది న‌ట్స్, షెల్ ఫిష్, ఆలు గ‌డ్డ‌లు, డార్క్ చాక్లెట్, మాంస‌కృతుల్లోనూ ఉంటుంది. ఈ కాపర్ వ‌ల్ల బ్రెయిన్, హార్ట్ చాలా ఆరోగ్య‌క‌రంగా ఉంటాయి. పైగా యాంటీ బ్యాక్టీరియ‌ల్ (anti bacterial) ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ‌.

కాప‌ల్ (copper) వాటర్ బాటిల్స్‌లో, లేదా గ్లాసుల్లో నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే తాగితే ఎంతో మంచిదని ప్రూవ్ అయింది కూడా. రాగి చెంబులు, గ్లాసులు, సీసాల నుంచి నీళ్లు తాగుతూ ఉండ‌టం ద్వారా వాతా, పిత్తా, క‌ఫ దోషాలు కూడా తొల‌గిపోతాయి. ఈ కాప‌ర్ అనేది ఒంట్లో మెల‌నిన్‌ని (melanin) ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వ‌ల్ల ఎండ నుంచి వ‌చ్చే UV కిరణాలు మ‌న చ‌ర్మాన్ని ఏమీ చేయ‌లేవు.

అమెరిక‌న్ క్యాన్స‌ర్ సొసైటీ చేసిన రీసెర్చ్‌లో తేలిందేంటంటే.. ఈ కాప‌ర్ బాటిల్స్, గ్లాసులు వాడ‌టం ద్వారా BP రాకుండా ఉంటుంద‌ట‌. ఒక‌వేళ ఉన్నా.. గుండె స‌మ‌స్య‌ల‌ను క‌లిగించే ట్రై గ్లిస‌రైడ్లు (triglycerides) పెర‌గ‌కుండా చూస్తుంద‌ట‌. మ‌న ఒంట్లో ఐర‌న్ లోపించిందంటే ఎనీమియా వస్తుంది. కాపర్ నుంచి నీళ్లు తాగ‌డం ద్వారా మ‌నం తిన్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి హెమొగ్లోబిన్‌గా మారుస్తుంది. హెమొగ్లోబిన్  (haemoglobin) బాగుంది అంటే మ‌న ఒంట్లో ర‌క్తం బాగున్న‌ట్లే. అర్థ‌రైటిస్‌తో (arthirits) బాధ‌ప‌డేవారికి ఈ కాప‌ర్ (copper) ఇంకా మంచిది. ఇన్‌ఫ్ల‌మేష‌న్ త‌గ్గిస్తుంది.