Dragon Fruit: వారంలో ఒకసారైనా తినాల్సిందే..!
Hyderabad: పండ్లు వేరు ఎగ్జాటిక్ పండ్లు వేరు. పండ్లు అంటే సాధారణంగా మార్కెట్లో మన ఇంటి ముందు బండిపై అమ్మేవావి పండ్ల కిందికి వస్తాయి. ఎగ్జాటిక్ పండ్లు అంటే.. ఇవి కొనుక్కోవాలంటే సూపర్మార్కెట్స్, డెలివరీ యాప్స్‌లో నుంచి కొనుగోలు చేయాలి. అలాంటి ఎగ్జాటిక్ ఫ్రూట్లో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ (dragon fruit). ఇప్పుడు ఇది రోడ్లపై కూడా విరివిగా దొరికేస్తోంది. వీటిని కనీసం వారంలో ఒకసారైనా తిని చూడండి. ఎందుకంటే.. ఎగ్జాటిక్ పండ్లు ఎంత ఖరీదు ఉంటాయో వాటిలో ఉండే పోషక విలువలు కూడా అంతే బాగుంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే లాభాలు
*ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి శరీరంలో కలిగే సర్వ రోగాలకు ప్రధానమైన ఫ్రీ ర్యాడికల్స్‌పై దాడి చేస్తాయి.
*డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. (dragon fruit)
*డ్రాగన్ ఫ్రూట్లో పీచు కూడా ఎక్కువే. కాబట్టి తిన్నాక సులువుగా డైజెస్ట్ అవుతుంది. రెగ్యులర్‌గా తినడం వల్ల మలబద్ధకం కూడా పోతుంది.
*గుండెకు హాని కలిగించే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో తోడ్పతుంది.
*డ్రాగన్ ఫ్రూట్లో గ్లైసెమిక్ ఇన్డెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. (dragon fruit)
*కంటి చూపును కాపాడే బీటా కెరోటిన్, ల్యూటీన్ కూడా డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్ది కంటి చూపు తగ్గిపోతుంది. అలా వయసుతో వచ్చే కంటి సమస్యల్ని అదుపులో ఉంచుతుంది.
*డ్రాగన్ ఫ్రూట్ నిండా ఉండేది నీరే. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యలు కూడా రావు. చర్మానికి కూడా ఎంతో మేలు.
*తక్కువ కేలొరీలు, అధిక ఫైబర్ కంటెంట్ ఉండే పండ్లు కాబట్టి రోజూ తీసుకున్నా కూడా బరువు తగ్గుతారు. ఫైబర్ కంటెంట్ ఎంత తీసుకుంటే అంత తక్కువగా ఆకలి వేస్తుంది. (dragon fruit)
*కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎముకలు బలంగా ఉండటానికి ఎంతో కీలకం. ఈ మూడు మినరల్స్ డ్రాగన్ ఫ్రూట్లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ కాకపోయినా వారానికి ఒకసారైనా తింటూ ఉండండి.