Oil: జుట్టుకి నూనె రాసుకుని నిద్రపోతున్నారా?
రాత్రి వేళల్లో తలకు నూనె (oil) రాసి బాగా మర్దన చేసుకుని అలాగే నిద్రపోతుంటారు. ఉదయాన్నే తలస్నానం చేస్తుంటారు. అసలు కురులకు నూనె రాసి రాత్రిళ్లు అలాగే వదిలేసి నిద్రపోవచ్చా?
*నూనె రాసుకుని అలాగే నిద్రపోతే ఆ నూనె మొత్తం మీ దిండు పీల్చేసుకుంటుంది. మీరు మర్చిపోయి మళ్లీ అదే దిండుపై పడుకుంటే దానికి ఉన్న దుమ్ము అంతా నూనెతో సహా మీ ముఖానికి అంటుతుంది.
*తలకి ఎక్కువగా నూనె రాసుకుంటే అది ముఖానికి చేరి పోర్స్ (రంధ్రాలు) మూసుకుపోయేలా చేస్తుంది. యాక్నె కూడా మొదలవుతుంది. (oil)
*రాత్రంతా తలకు నూనె రాసి వదిలేస్తే ఓవర్ కండీషనింగ్ అవుతుంది. దాంతో మీరు మరుసటి రోజు తల స్నానం చేసినా కూడా జిడ్డుగానే ఉండిపోతుంది.
*కొన్ని రకాల నూనెలు తలకు రాసుకుని రాత్రంతా అలాగే వదిలేస్తే జుట్టు వాసన వస్తుంది.
*ఒకవేళ నూనె రాసుకోవాలనుకుంటే రెండు మూడు చుక్కలను చేతులకు బాగా మర్దన చేసి జుట్టు చివరి భాగంలో మాత్రమే రాసుకోండి. (oil)
*రాత్రిళ్లు నూనె రాసుకుని పడుకుంటే దురద పుడుతుంది. డ్రాండ్రఫ్ వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి కుదుళ్ల దగ్గర కాస్త ఒత్తిడి పెట్టి మరీ షాంపూతో రుద్దుకోవాలి.
*నూనె పెట్టుకుని నిద్రపోతే స్ల్పిట్ ఎండ్స్ వస్తాయి. జుట్టు నిర్జీవంగా మారుతుంది.
మరి పరిష్కారం ఏంటి?
జుట్టుకి నూనె రాసుకోవడం మంచిదే. కాకపోతే ఎప్పుడు ఎలా రాసుకుంటున్నాం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ మీరు నూనె రాసుకోవాలని అనుకుంటే.. మీకు తీరిక ఉన్నప్పుడు కాస్త నూనెను వేడి చేసి కుదుళ్లకు రాసి మర్దన చేసుకోండి. ఒక అరగంట పాటు అలా ఉంచేసి అప్పుడు తల స్నానం చేస్తే మంచిది. అంతేకానీ రాత్రంతా నూనె రాసుకుని నిద్రపోవడాలు వంటివి వద్దు .