Health: నీళ్లను తింటున్నారా?
Health: నీళ్లను తాగుతారు కానీ తినడం ఏంట్రా అనుకుంటున్నారా? సాధారణ నీళ్లయితే తాగుతాం. కానీ నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటే నీళ్లు తాగినట్లే అని అంటున్నారు నిపుణులు. రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని అంటుంటారు. ఇది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారికే వర్తిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు కచ్చితంగా వైద్యులు ఎంత మోతాదులో తాగమంటే అంతే మోతాదులో తాగాల్సి ఉంటుంది. వేసవిలో అనే కాదు చలికాలం, వర్షాకాలాల్లో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తింటే మంచిది. అవేం పండ్లంటే…
పుచ్చకాయ
నారింజ
పీచ్
పైనాపిల్
స్ట్రాబెర్రీ
బ్లూబెర్రీ
ద్రాక్ష