Black Coffee: కాఫీలయందు బ్లాక్ కాఫీ వేరయా..!
కాఫీలయందు బ్లాక్ కాఫీ (black coffee) వేరయా అంటుంటారు. సాధారణంగా పాలతో కలుపుకుని తాగే కాఫీ వేరు. ఈ బ్లాక్ కాఫీ వేరు. నిజానికి పాలతో కలిపి తాగే కాఫీ కంటే బ్లాక్ కాఫీ ఎంతో మేలు. అసలు బ్లాక్ కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
*బ్లాక్ కాఫీలో అసలు కేలొరీలు ఉండవు. అందుకే ఎక్కువగా దీనినే ప్రిఫర్ చేస్తుంటారు.
*ఇది తాగగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీనిని ఎక్కువగా తాగుతుంటారు.
*బ్లాక్ కాఫీ తాగగానే మన నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. దాంతో ఎంతో చురుగ్గా రోజూ వారి పనులు చేసుకుంటూ ఉంటాం.
*బ్లాక్ కాఫీ వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది. డయాబెటిస్ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
*మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఆ భాగాన్ని క్లీన్గా ఉండేందుకు సాయపడుతుంది. (black coffee)
*బ్లాక్ కాఫీ తాగితే మూత్రం ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఒంట్లో ఉన్న టాక్సిన్లు కూడా బయటికి వెళ్లిపోతాయి.
*మెదడు పనితీరు బాగుంటుంది. మొద్దుబారిపోయినట్లు కాకుండా బాగా ఆలోచించగలుగుతారు. జ్ఞాపకశక్తి బాగుంటుంది.
*పని ఒత్తిడిలో ఉన్నారనుకోండి.. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగి చూడండి. ఎక్కడలేని ఓపిక శక్తి వచ్చేస్తాయి. మూడ్ కూడా బాగుంటుంది.