Personal Hygiene: అక్క‌డ శుభ్రం చేసుకుంటున్నారా లేదా?

ప‌ర్స‌న‌ల్ హైజీన్ (personal hygiene) అనేది ఎంతో ముఖ్యం. మ‌నం స్నానం చేసేట‌ప్పుడు శ‌రీర‌మంతా ఎలా శుభ్రం చేసుకుంటామో వ్య‌క్తిగ‌త పార్ట్స్ (genitals) కూడా అంతకంటే ఎక్కువ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ‌గా అనారోగ్య స‌మ‌స్య‌లు అక్క‌డి నుంచే మొద‌ల‌వుతాయి. ఈ విష‌యంలో సిగ్గుప‌డాల్సినది ఏమీ లేదు. స‌రిగ్గా తెలుసుకోగ‌లిగితే ఎన్నో విష‌యాలు నేర్చుకుంటాం. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటాం.

మ‌గ‌వారు త‌మ వ్య‌క్తిగ‌త అవ‌య‌వాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ముందు తెలుసుకుందాం. రోజుకు ఒక‌సారి వ్య‌క్తిగ‌త అవ‌య‌వాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. శృంగారానికి ముందు త‌ర్వాత కూడా అంతే శుభ్రం చేసుకోవాలి. మైల్డ్ క్లెన్స‌ర్ స‌ప‌రేట్‌గా వ్య‌క్తిగ‌త పార్ట్స్‌ని శుభ్రం చేసుకోవ‌డానికి అమ్ముతుంటారు. అది వాడితే మంచిది. కేవ‌లం నీటితో క‌డిగితే క్రిములు పోవు. క్లెన్స‌ర్‌తో బాగా శుభ్రం చేసుకుని గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న త‌ర్వాత ఒక డ్రై వ‌స్త్రంతో మెల్లిగా తుడుచుకోండి. ఆ త‌ర్వాత మైల్డ్ మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోండి. మాయిశ్చ‌రైజ‌ర్‌లో షియా బ‌ట‌ర్, విట‌మిన్ ఈ ఉంటే మంచిది. (personal hygiene)

ప్రైవేట్ పార్ట్స్‌లో వ‌చ్చే అవాంచిత రోమాల‌ను ఎప్ప‌టికప్పుడు తీసేయాలి. వాక్సింగ్, లేజ‌ర్ ట్రీట్మెంట్లు కాకుండా రేజ‌ర్‌తో క్లీన్ చేసుకుంటేనే మంచిది. వ్యాక్సింగ్, ట్రీట్మెంట్స్ వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శృంగారం అయ్యాక వెంట‌నే బాత్రూంకి వెళ్లి మూత్రం పోసేయండి. ఆ త‌ర్వాత శుభ్రం చేసుకోండి. లేదంటే బ్యాక్టీరియా చేరుతుంది. మీ ప‌ర్స‌న‌ల్ పార్ట్‌పై చ‌ర్మం రంగు మారిన‌ట్లు కానీ.. ఎప్పుడూ లేని వాస‌న వ‌స్తున్న‌ట్లు కానీ అనిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించండి. మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే వెంట‌నే వైద్యుల ద‌గ్గ‌రికి ప‌రిగెడ‌తాం. కానీ ఇలాంటి ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఉంటే మొహ‌మాటప‌డ‌తాం. ఇందులో సిగ్గు మొహ‌మాట ప‌డ‌టానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ అంశాల గురించి స్కూల పిల్ల‌ల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో చెప్పాల‌ని టీచ‌ర్లు కూడా చెప్తున్నారు.

ఇక మ‌హిళ‌ల విష‌యానికొస్తే.. యోనిలోని వ‌ల్వా అనే ప్ర‌దేశంపై ఎక్కువ‌గా శుభ్రం చేసుకోవాలి. అక్క‌డే ఎక్కువ‌గా బ్యాక్టీరియా ఉంటుంది. యోని తెరుచుకునే ప్ర‌దేశంలో కూడా వేడి నీళ్ల‌తో రోజూ శుభ్రం చేసుకోవ‌డం ముఖ్యం. గాఢ‌మైన స‌బ్బులు, బాడీ వాష్‌లు అస్స‌లు వాడ‌కూడ‌దు. అవి స‌మ‌స్య‌ను పెంచుతాయి. ఇక్క‌డ తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. యోనికి దానంత‌ట అదే శుభ్రం చేసుకునే కెపాసిటీ ఉంది. కాక‌పోతే మ‌హిళ‌లు పై పైన శుభ్రం చేసుకోవ‌డం ముఖ్యం. యోని రంధ్రంలోకి మాత్రం ఎలాంటి క్లెన్స‌ర్లు పోకుండా చూసుకోండి. లోప‌ల శుభ్రం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బ్యాక్టీరియా అనేది బ‌య‌టి నుంచే లోప‌లికి వెళ్తుంది కాబ‌ట్టి మీరు పై ప్ర‌దేశంలో మాత్రం కాస్త శ్ర‌ద్ధగా ఉండండి. (personal hygiene)