Tired: ఎప్పుడూ అల‌స‌ట‌గా అనిపిస్తోందా?

Hyderabad: కొన్ని సార్లు ఎంత తిన్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా ఎప్పుడూ అల‌స‌టగానే (tired) క‌నిపిస్తుంటారు కొంద‌రు. ఇందుకు కార‌ణం ఏంటో తెలుసా? స‌రైన తిండి, నిద్ర‌, ఎక్స‌ర్‌సైజ్ లేక‌పోవ‌డ‌మే. అదేంటి బాగానే తింటున్నామే అనుకోవ‌చ్చు. కానీ ఆ తిండిలో మ‌న శరీరానికి కావాల్సిన‌వి వెళ్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి.

కాఫీ ఎక్కువ‌గా తాగేస్తున్నారా?
కాఫీ లేనిదే పూట గ‌డ‌వ‌దు. రోజూ ఉద‌యాన్నే కాఫీ తాగాకే ప‌ని ప్రారంభిస్తాం. కానీ దాని ఎఫెక్ట్ ఒక రెండు మూడు గంట‌లు మాత్ర‌మే ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నిద్ర వ‌స్తోంద‌ని మ‌రో క‌ప్పు తాగేస్తాం. ఇది టెంప‌రరీగా బాగానే ప‌నిచేసినా ప‌ర్మ‌నెంట్ స్లీప్ డ్యామేజ్ చేస్తుంద‌ని గుర్తుంచుకోవాలి.

ట్రిప్టోఫ్యాన్ ఎక్కువ‌గా ఉండే ఫుడ్
ట్రిప్టోఫ్యాన్ అనేది అమైనో యాసిడ్. మ‌న శ‌రీరంలో ఉండే ప్రొటీన్స్, కండ‌రాలు, ఎన్‌జైమ్స్, న్యూట్రోట్రాన్స్‌మిట‌ర్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ట్రిప్టోఫ్యాన్ వ‌ల్ల సెరోటొనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది. ఈ ట్రిప్టోఫ్యాన్ ఎక్కువ‌గా గుడ్లు, న‌ట్స్, ప‌ప్పుదినుసులు, ట‌ర్కీ కోడి, చీజ్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అన్నీ కాక‌పోయినా ఏదో ఒక‌దానిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవ‌డానికి ట్రై చేయండి. (tired)

B విట‌మిన్ ఎక్కువ తీసుకోవాలి
B విట‌మిన్ క‌లిగిన ఫుడ్స్ ఎక్కువ‌గా తీసుకుంటే ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు. పాలు, ఓట్స్, టూనా, సాల్మ‌న్, చీజ్‌ల‌లో ఈ విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది. మెట‌బాలిజం బూస్ట్ చేస్తే అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఈ ఆహార పదార్థాల్లో ఉన్నాయి కాబ‌ట్టి అల‌స‌ట‌గా అనిపించ‌దు. (tired)