Clove Tea: లవంగాల చాయ్‌తో ఎన్ని లాభాలో..!
చాయ్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. కుదిరితే మనమే ఆరోగ్యకరమైన పదార్థాలతో ఒక స్పెషల్ చాయ్ చేసుకుని తాగేయొచ్చు. కాకపోతే అందులో పాలు మిక్స్ చేయకండి. నిజానికి చాలా మంది పాలతో చేసిన చాయ్ అంటేనే ఇష్టపడతారు. కానీ పాలు లేకుండా వివిధ రకాల పదార్థాలతో చేసిన టీ తాగితే ఎంతో ఆరోగ్యం. ఇక లవంగాలతో (clove tea) చేసిన టీ తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.
*లవంగాల టీని రోజూ తాగుతుంటే.. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. ఒకవేళ ట్యూమర్ ఉన్నా కూడా అది పెగరకుండా చేస్తుంది.
*ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది.
*అరుగుదల బాగుంటుంది.
*ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. (clove tea)
*తలనొప్పులను ఇట్టే తగ్గించేస్తుంది.
*లవంగాల్లో ఉండే యూజనాల్ ఈసోఫాగల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
*లవంగాల్లో యూకలిప్టస్ ఉంటుందట. ఇది లివర్‌ను కాపాడటంతో సహాయపడుతుంది. (clove tea)
*లవంగాల్లో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్, బీటా స్టిటోస్టెరాల్ లివర్‌లోని సెల్స్ పాడవకండా కాపాడతాయి.
*జీర్ణాశయంలో పెప్టిక్ అల్సర్లు కాకుండా చేస్తుంది.