Skin Health: చర్మానికీ ఉంది ఫాస్టింగ్..!
మన శరీరం, జీర్ణాశయం శుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఫాస్టింగ్ అనేది కేవలం తిండి విషయంలోనే కాదు.. చర్మం (skin health) విషయంలోనూ వర్తిస్తుంది. దానినే స్కిన్ ఫాస్టింగ్ (skin fasting) అంటారు. అసలు స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏంటి.. ఎలా చేయాలి.. దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏంటి?
ముఖం కడుక్కోగానే టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అని ఒక లేయర్‌పై మరో లేయర్ క్రీమ్స్ రాసేస్తుంటారు. ఇంకొందరైతే లేయర్ల కొద్ది మేకప్ కూడా వేసుకుంటూ ఉంటారు. అది వారి వృత్తిలో భాగంగా వేసుకుంటారు కాబట్టి ఏమీ చేయలేం. అదే మీరు వారంలో ఒకసారి ఫాస్టింగ్ ఉన్నట్లు.. అంటే ఏమీ తినకుండా ఉన్నట్లు.. మీ చర్మానికి కూడా ఎలాంటి క్రీమ్స్ రాయకుండా అలా వదిలేయండి. దానినే స్కిన్ ఫాస్టింగ్ అంటారు. (skin health)
అలాగని అసలు ఏమీ రాయకుండా వదిలేయమని కాదు. కేవలం ఒక మాయిశ్చరైజర్ రాసి వదిలేయండి. చర్మం కాంతిమంతంగా తయారవడానికి దానికి కూడా కాస్త బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే పనిగా రోజూ క్రీమ్స్, మేకప్ వేసేస్తుంటే నేచురల్ ఆయిల్స్ అన్నీ పోయి మరింత నిర్జీవంగా మారిపోతుంది. అయితే వారంలో ఒక రోజు అని కాదు.. కుదిరితే కొన్ని రోజలు లేదా వారాల పాటు ఇలా కేవలం ఒక మాయిశ్చరైజర్‌ని రాసి వదిలేయండి. అప్పుడు చర్మానికి కాస్త గాలి పీల్చుకున్నట్లు అవుతుంది. (skin health)
మీరు వాడే క్రీమ్స్‌లో ఇవి ఉన్నాయా?
టీవీ ప్రకటనలు చూసి అన్ని క్రీమ్స్ వాడేయాలని చూసే ఆడవారు లేకపోలేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. వీలుంటే ఒకసారి స్కిన్ డాక్టర్‌ను కలిసి అసలు మీ చర్మం ఏ టైపో తెలుసుకోండి. అంటే పొడిబారుతుందా.. లేకా ఆయిలీగా ఉంటుందా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మీ చర్మానికి తగ్గట్టు ఎలాంటి పదార్థాలతో తయారుచేసిన ప్రొడక్ట్స్ వాడాలో డాక్టరే చెప్తారు. అంతేకానీ.. టీవీలో హీరోయిన్లు రాసుకుంటున్నారు కదా అని ఏది పడితే అది రాసేయకండి. దాని వల్ల చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది. అప్పుడు కాస్ట్లీ చికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రొడక్టులలో రెటినాయిడ్స్ (retinoids) ఉంటే వాటిని ఎక్కువగా వాడకపోవడమే మంచిది. దీని వల్ల చర్మం ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఈ స్కిన్ ఫాస్టింగ్ ప్రక్రియను ట్రై చేయాలనుకుంటే వెంటనే అన్ని ప్రొడక్టులను వాడటం మానేయకూడదు. నిదానంగా ఒక్కో క్రీమ్ వాడకాన్ని తగ్గిస్తూ రండి. అప్పుడే చర్మం కూడా అలవాటుపడుతుంది.
మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇది కేవలం జనరల్ పబ్లిక్ కోసం సమాచారంగా ఇవ్వబడింది