Black Carrot: న‌ల్ల క్యారెట్.. పోష‌కాల గ‌ని..!

Black Carrot: క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉంటాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఎప్పుడైనా న‌ల్ల క్యారెట్ల గురించి విన్నారా? కనీసం మ‌నం చూసి కూడా ఉండం. ఎందుకంటే ఇవి భార‌త‌దేశంలో లోక‌ల్ మార్కెట్ల‌లో అయితే ఎక్క‌డా దొర‌క‌వు. సాధార‌ణ క్యారెట్ల‌లో కంటే ఈ న‌ల్ల క్యారెట్ల‌లో పోష‌కాలు రెట్టింపు ఉంటాయి. ఈ న‌ల్ల క్యారెట్లు పోష‌కాల గ‌ని అని చెప్ప‌చ్చు. మీకెప్పుడైనా ఈ న‌ల్ల క్యారెట్లు క‌నిపిస్తే వ‌ద‌ల‌కుండా ఒక్క‌సారైనా తినేందుకు ప్ర‌య‌త్నించండి.

*ఇవి న‌ల్ల‌గా ఉండ‌టానికి కార‌ణం ఇందులో ఆంథోస‌యానిన్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌టం. ఈ ఆంథోస‌యానిన్ అనేది బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీల‌లో ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే వాటికి ఆ న‌ల్ల రంగు వ‌స్తుంది. (black carrots)

*వీటిలో ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల ఒత్తిడి త‌గ్గుతుంది.

*చెడు కొలెస్ట్రాల్‌ను ఇట్టే త‌గ్గించేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

*సాధార‌ణ క్యారెట్ల మాదిరిగానే కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

*మ‌ల‌బ‌ద్ధ‌కం దూరమ‌వుతుంది. జీర్ణాశ‌యం ఆరోగ్యంగా ఉంటుంది. (black carrots)