Kidneys: కాలుష్యం.. ఊపిరితిత్తులకే కాదు కిడ్నీలకూ డేంజరే..!
Kidneys: రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా దాని ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు కిడ్నీలపైనా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యమైన గాలిని పీల్చడం వల్ల నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపి వాటి పనితీరు పాడు చేసిన కేసులు చాలానే ఉన్నాయట.
అసలు వాయు కాలుష్యం కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతుంది?
మనం కలుషితమైన గాలిని పీల్చుకున్నప్పుడు విషపూరితమైన దుమ్ము ధూళి ఊపిరితిత్తుల్లో పేరుకుపోతాయి. ఇది గుండె పనితీరుని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఊపిరితిత్తుల వెనుక భాగంలోనే గుండె ఉంటుంది. వాయు కాలుష్యం వల్ల గుండె పనితీరు దెబ్బతింటే దానిని ఆస్తియో స్ల్కీరోసీస్ (atherosclerosis) అంటారు.
దీని వల్ల గుండెలో ఉండే ధమనులు (arteries) దెబ్బతింటాయి. ఒక్కసారి ధమనులు గట్టి పడి సరిగ్గా ముడుచుకుని తెరుచుకోలేకపోతే గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. గుండె పనితీరు బాలేకపోతే ఆటోమేటిక్‌గా కిడ్నీలు కూడా పాడవుతాయి. కొన్ని పరిశోధనలలో తేలిన విషయం ఏంటంటే.. వాయు కాలుష్యం వల్ల టైప్ 2 మధుమేహం వస్తుందట. మధుమేహం వస్తే ముందుగా దాని ప్రభావం కిడ్నీలపైనే ఉంటుంది. దీని వల్ల కిడ్నీలు పాడయ్య ప్రమాదం ఉంటుంది.