Haemoglobin D-Punjab: గుంటూరులో ఇద్దరికి అరుదైన వైరస్.. అసలేంటీ వైరస్?
Haemoglobin D-Punjab: గుంటూరులోని జీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరు వ్యక్తులకు అరుదైన వైరస్ వచ్చింది. ఈ వైరస్ పేరు హెమొగ్లోబిన్ డి పంజాబ్. పేషెంట్లు ఇద్దరూ పల్నాడుకు చెందివారిగా వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ వైరస్ సోకడం ఇదే మొదటిసారి.
అసలు ఏంటీ వైరస్?
బీటా గ్లోబిన్ జన్యులో మార్పు చోటుచేసుకోవడం వల్ల ఈ వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఎక్కువగా పంజాబ్, ఉత్తర చైనా, ఉత్తర అమెరికా వాసులకు వస్తుంటుంది. అందుకే ఈ వైరస్‌కు హెమోగ్లోబిన్ డి పంజాబ్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి సాధారణ వైద్యంతోనే తగ్గిపోతుంది. సమస్య సీరియస్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్ సెల్ థెరపీ చికిత్సలు అవసరం అవుతాయి.