TS: డిసెంబర్‌లోనే ఎన్నికలు.. జూన్ 1న evmల తనిఖీ

hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(telangana assemble elections)పై ఈసీ(ec focus) దృష్టి సారించింది. ముఖ్యంగా ఓటరు లిస్ట్, ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల అంశాలతోపాటు ఆయా పార్టీలకు ఉన్న అభ్యంతరాలపై అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నుంచి తమకు ఎలాంటి సూచనలు రాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మరోసారి స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

సాంకేతికంగా జనవరిలోనే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ఇటీవల ఢిల్లీ నుంచి ఈసీ అధికారులు హైదరాబాద్ వచ్చి రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపారు. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కొత్త పద్ధతులను అమలు చేయడంపై ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమైంది. ముఖ్యంగా అన్ని స్థాయిల పోలింగ్ అధికారులకు శిక్షణ, ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యక్రమాలు. ఓటర్ల జాబితా సవరణపై చర్చించారు. ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, తొలగింపు జాబితాను రూపొందించాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారులతో కూడిన సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల అధికారులకు సూచించారు. జూన్ 1 నుంచి ఈవీఎంలను మొదటి స్థాయి తనిఖీలు ప్రారంభించాలని కేంద్ర ఎన్నికల బృందం సూచించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించాలని సీఈవోను బృందం ఆదేశించింది.