Sunil Gavaskar: అతను సచిన్‌పై పడి ఎందుకు ఏడుస్తున్నాడు?
Sunil Gavaskar: మాజీ టీమిండియా కెప్టెన్ సునీల్ గవాస్కర్.. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖెల్ వాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన జో రూట్ టెస్ట్ క్రికెట్ బాగా ఆడతాడని.. టెస్ట్ క్రికెట్లో జో రూట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రికార్డులను కూడా బద్దలుకొడతాడని అన్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బీసీసీఐ కేవలం భారతీయులకు మాత్రమే రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఇస్తుందని.. ఒకవేళ జో రూట్‌కి అవకాశం ఇస్తే సచిన్ స్థానంలో అతనే ఉంటాడని వాగన్ కూసాడు.
ఇది సునీల్ గవాస్కర్ దృష్టికి రావడంతో మండిపడ్డారు. టెస్ట్ క్రికెట్లో సచిన్ తెందుల్కర్ రికార్డులు ఉంటే ఇప్పుడు వాగన్‌కి వచ్చిన నష్టమేంటి అని ప్రశ్నించారు. విదేశీయులకు ఇండియన్ క్రికెటర్లపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం అలవాటైపోయిందని అన్నారు. ఇదంతా వారు పబ్లిసిటీ కోసం చేస్తుంటారని.. అందుకే ఎప్పటికప్పుడు వారి నోళ్లు మూతపడేలా సమాధానం ఇస్తుండాలని అన్నారు.