Straight From Heart: అంత మంచి భ‌ర్త‌ను ఎలా వ‌దులుకుందో..!

మంచి భ‌ర్త రావాల‌ని కోరుకోని అమ్మాయి ఉండ‌దు. అలాంటి భ‌ర్త దొరికితే మాత్రం ఆ అమ్మాయి జీవితం ఆనంద‌మ‌యం అవుతుంది. కానీ ఓ అమ్మాయి మాత్రం త‌న మూర్ఖ‌త్వంలో మంచి భ‌ర్త దొరికిన‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రుల మాట విని అత‌న్ని దూరం చేసుకుంటోంది అంటూ ఓ అమ్మాయి త‌న ఫ్రెండ్ గురించి మాకు రాసిన క‌థే ఇది. ఆ క‌థ ఆ అమ్మాయి మాట‌ల్లోనే.. (straight from heart)

హాయ్ ఫ్రెండ్స్..

ఒక అమ్మాయి.. ఆమె త‌ల్లిదండ్రుల వ‌ల్ల న‌లిగిపోతున్న నా ఫ్రెండ్ గురించి మీతో షేర్ చేసుకోవాల‌ని అనుకుంటున్నా. నేను హైద‌రాబాద్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడు నా ఆఫీస్‌లోనే ప‌రిచ‌యం అయ్యాడు ఆ అబ్బాయి. ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాడు. ఎంత బాగా మాట్లాడేవాడంటే.. ఫ్ల‌ర్ట్ చేయ‌డానికి న‌టిస్తున్నాడేమో అనుకున్నా. కానే కాదు. ఆ అబ్బాయి ప్ర‌తి ఒక్క‌రితోనూ అంతే హుందాగా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఎవ‌రు ఏ బాధ‌లో ఉన్నా త‌న వంతు సాయం చేయాల‌ని చూసేవాడు. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారా అని ఆశ్చ‌ర్యం వేసేది. ఆ అబ్బాయికి ఏడాది క్రితం పెళ్ల‌య్యింది. అత‌ని భార్య‌కి అత‌నంటే ఎంతో ఇష్టం. సంవ‌త్స‌రం తిరిగేలోగా వారికి ఒక బాబు పుట్టాడు. మ‌మ్మ‌ల్ని పిలిచి పార్టీ కూడా ఇచ్చాడు. అంతా బాగానే ఉంది అనుకుంటే.. గ‌త ఆరు నెల‌లుగా అత‌ను ఎంతో మానసిక వేద‌న‌కు గుర‌వుతున్నాడ‌ని తెలిసింది. 

వ‌ద్దు వ‌ద్దు అనుకుంటూనే అస‌లు ఏమైందో తెలుసుకోకుండా ఉండ‌లేక‌పోయా. అత‌ను చెప్పిందంతా విన్నాక మంచి వారికి మంచి జ‌ర‌గదు అన్న మాట 100% నిజం అనిపించింది. అత‌నికి ఇలాంటి క‌ష్టాన్ని ఇచ్చిన దేవుడిపై కోపం వ‌చ్చింది. అత‌నికి వ‌చ్చిన క‌ష్టం అత‌ని భార్యే. నువ్వంటే నాకు ప్రాణం.. నీకోసం ప్రాణం ఇస్తా అని చెప్పిన ఆ అమ్మాయి బిడ్డ పుట్టాక పూర్తిగా త‌ల్లిదండ్రుల మాట వింటూ భ‌ర్త‌ను, అత్తామామ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసింది. అలాగ‌ని ఆమె చెడ్డ‌ది అని చెప్ప‌డంలేదు. ఆమెకు బ్రెయిన్ ఎద‌గ‌లేదేమో అనిపించింది. నా ఫ్రెండ్ ఎంత మంచివాడంటే.. క‌ట్నం కూడా ఆశించ‌లేదు. ఆ అమ్మాయి వాళ్ల త‌ల్లిదండ్రులే బాబూ.. మేం రూ.4 ల‌క్షల వ‌ర‌కు క‌ట్నం ఇచ్చుకోగ‌లం అని చెప్పార‌ట‌. వ‌ద్దు అంటున్నా కూడా వారు ఆ రూ.4 ల‌క్ష‌లు ఇచ్చారు. పెళ్ల‌య్యాక ఆ అబ్బాయికి షాకింగ్ విష‌యం తెలిసింది. ఆ రూ.4 ల‌క్ష‌లు ఇవ్వ‌డానికి ఆ అమ్మాయి చేత లోన్ తీయించార‌ట‌. (straight from heart)

ALSO READ: నో చెప్తే ఇంత‌కు దిగ‌జారాలా..?

నేను క‌ట్నం వ‌ద్దు అన్న‌ప్పుడు లోన్ తీసుకుని ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది అని ఆ అబ్బాయి తిట్టాడు. ఆ అమ్మాయి చేసే జాబ్‌కి కూడా ఎక్కువ‌గా జీతం ఏమీ రాదు. అంతా అబ్బాయే చూసుకుంటున్నాడు. . దాంతో ఆ రూ.4 ల‌క్ష‌ల లోన్ తీర్చే బాధ్య‌త త‌న‌పై వేసుకున్నాడు. ఈ విష‌యాన్ని ఆ అబ్బాయి క‌న్న‌త‌ల్లిదండ్రుల‌కు కూడా చెప్ప‌లేదు. తెలిస్తే అమ్మాయిని తిడ‌తారేమోన‌ని. పెళ్లి త‌ర్వాత ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. అల్లుడు అనే గౌర‌వం లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడేవారు. పాపం ఆ అబ్బాయి మాత్రం ఎంత‌ని స‌హిస్తాడు. ఓసారి గట్టిగా గొడ‌వ‌ప‌డ్డాడు. దానికి వారు కేసులు పెడ‌తాం నీ అంతు చూస్తాం అని రివ‌ర్స్‌లో పేట్రేగిపోయేవారు. ఇప్పుడు ఆ అమ్మాయి బిడ్డ‌తో త‌న త‌ల్లిదండ్రుల‌తోనే ఉంటోంది. ఎన్నోసార్లు ఆ అబ్బాయి మ‌న ఇంటికి వెళ్దాం అని అడిగినా కూడా నేను రాను.. ఆలోచించుకుని చెప్తాను అంటోంది త‌ప్ప త‌న భ‌ర్త గురించి మాత్రం ఆలోచించ‌డంలేదు. 

ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా కూడా ఆ అబ్బాయి మానసికంగా ఎంతో డిస్ట‌ర్బ్ అవుతున్నాడు. ఆడపిల్ల భ‌ర్త‌ను వ‌దిలి పుట్టింట్లో వ‌చ్చి కూర్చుంటే న‌చ్చ‌జెప్పి పంపించాల్సిపోయి విడాకులు ఇచ్చేయ్ అంటున్నారట‌. ఇదేం వింత‌? ఆ అమ్మాయి త‌ల్లిదండ్రులు ఆస్తిప‌రులా అంటే అదీ కాదు. ఆయ‌న టీచ‌ర్‌గా ప‌నిచేస్తూ నెల‌కు రూ.10 వేలు సంపాదిస్తున్నాడు. ఏ ధైర్యంతో త‌న కూతురికి విడాకులు ఇప్పించి ఆ రూ.10 వేల‌తో మ‌న‌వ‌డిని కూతురిని ఇంటిని చూసుకోవాల‌ని అనుకుంటున్నాడో ఆయ‌న‌కే తెలియాలి. మ‌రోప‌క్క నా ఫ్రెండ్ విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నారో అర్థంకాక స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. మా అన్న జ‌డ్జి కావ‌డంతో కనీసం కౌన్సిలింగ్ ఇప్పించేందుకు సాయం చేస్తాన‌ని చెప్పాను. దేవుడి ద‌య వ‌ల్ల ఆ అబ్బాయి జీవితం బాగుప‌డితే అదే చాలు. (straight from heart)

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. తల్లిదండ్రుల మాట‌లు విని జీవితాలు నాశ‌నం చేసుకుంటున్న వారు ఇప్ప‌టికైనా అస‌లు మంచేదో చెడేదో తెలుసుకుని మసులుకుంటార‌ని. నా ఫ్రెండ్ లైఫ్‌తో ఆడుకుంటోంది అత‌ని భార్య త‌ల్లిదండ్రులే. అస‌లు వారు ఏం ప్లాన్ వేసారో తెలీట్లేదు కానీ నా ఫ్రెండ్ కోసం నేను నిల‌బ‌డాల‌ని అనుకుంటున్నా.