RRR​ టీమ్​కి ప్రముఖ నిర్మాత స్పెషల్​ గిఫ్ట్స్​​!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన సినిమా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్​ ఒరిజినల్​ స్టోర్​ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్‌‌ రావడంతో భారతీయ సినిమా పేరు ప్రపంచమంతా మారుమోగుతోంది. అంతేకాదు ఆ పాట గోల్డెన్ గ్లోబ్ ఆవార్డును కూడా సొంతం చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది.
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో అన్ని వర్గాల నుంచి చిత్ర యూనిట్‌కు ప్రశంసలు అందుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ చిత్ర యూనిట్‌కు స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందించారు. ఆ స్పెషల్ గిఫ్ట్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, ఆస్కార్​తో దేశానికి సగర్వంగా తిరిగొచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు టాలీవుడ్​ ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పెషల్ గిఫ్ట్ అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తరపున ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ చిత్ర యూనిట్కు ప్రత్యేకంగా గిఫ్ట్ అందజేసిన దిల్ రాజు.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గిఫ్ట్ లో గ్లోబ్, ప్రశంసా పత్రం, నాటు నాటు స్టెప్స్ తో పాటు ఫోటో, క్లాప్ బోర్డ్, మూవీ రీల్.. సినీ ఇండస్ట్రీని ప్రతిబింబించేలా దిల్ రాజు ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, రాం చరణ్, రాజమౌళి, కీరవాణి, దానయ్య, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ లను కలిసి దిల్ గిఫ్ట్లు అందజేసినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఓ వీడియో ఎస్వీసీ ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

రాం చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమాకు దిల్‌ రాజు నిర్మాతగా ఉన్నారు. ఎస్వీసీసీ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. RC15 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి చరణ్ వెళ్లడంతో కొంత బ్రేక్ వచ్చినప్పటికీ, తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్‌ సెట్‌కు వచ్చేశారు.
నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కిన సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన టీమ్‌తో స్టెప్స్ వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా దేశంలోని పలు భాషల్లోకి డబ్‌ చేసి విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించింది. అంతేకాదు, విదేశాల్లో కూడా విడుదలై అక్కడ కూడా రికార్డులకు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ టీంకు స్పెషల్‌ గిఫ్ట్‌ లు అందించిన దిల్‌ రాజును నెటిజన్లు అభినందిస్తున్నారు.