Ustaad Bhagat Singh : లీకైన పవన్​ లుక్​.. ఫొటో వైరల్!

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయా సిత్తం రీమేక్​ షూటింగ్​ పూర్తి చేసుకున్న పవన్​ ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్​లోకి అడుగు పెట్టారు. డైరెక్టర్​ హరీష్ శంకర్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంతో ఈ కాంబినేషన్​పై భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్​తో శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. పవన్ ఈ సినిమాకి 50 రోజులు కాల్ షీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ ఫోటో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

తెలుగు సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ముఖ్యంగా స్టార్​ హీరోల సినిమా షూటింగ్​లనుంచి తరచుగా ఫొటోలు, మేకింగ్​ వీడియోలు లీకవుతున్న సంగతి తెలిసిందే. అయితే మేకర్స్​ స్వయంగా వీటిని లీక్ చేస్తూ సినిమాలపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇక ఇదే తరహాలో తాజాగా ఉస్తాద్​ భగత్​ సింగ్​ నుంచి కూడా పవన్​ కల్యాణ్​ లుక్​ లీకైంది. ఈ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ చుసిన పవన్ అభిమానులు.. మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. ధమాకా బ్యూటీ శ్రీలీల ఒక హీరోయిన్​గా నటిస్తోందని వార్తలు వచ్చినా, మేకర్స్​ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమాకీ దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.

పవన్ మే నెల చివరి నాటికి ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసి హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేశారట. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నారు. కాగా, సుజీత్​ దర్శకత్వంలో రూపొందనున్న ఓజీ సినిమా షూటింగ్​నూ తర్వలోనే ప్రారంభించనున్నారట పవన్​. ఈ షూటింగ్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను సుజిత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట. ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌తో కనిపిస్తాడని టాక్​. మరి నిజంగానే ఓజి సినిమాలో పవన్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ రానిస్తున్న పవన్​ రాబోయే ఏపీ ఎన్నికలలోపు ఈ మూడు సినిమాలనూ పూర్తి చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది​.