OG: ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్.. ఇప్పుడు ప‌వ‌న్‌కి విల‌న్!

Hyderabad: ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోయారు.. బాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్‌.. ఇప్పుడు OG ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) విల‌న్‌గా న‌టిస్తాడ‌ని. అత‌ను ఎవ‌రో కాదు.. ఇమ్రాన్ హ‌ష్మీ (emraan hashmi). డైరెక్ట‌ర్ సుజీత్ (sujeeth) గ‌ట్టిగా ప్లాన్ చేసాడు అనుకున్నారు కానీ మ‌రీ ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తాడ‌ని అస్సలు ఊహించ‌లేదు. అర్జున్ దాస్, శ్రియ రెడ్డి లాంటి వారిని సినిమాలో పెట్టాడంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో అర్థ‌మైపోతోంది. ఇక ఇమ్రాన్ హాష్మీకి (emraan hashmi) ఇది ఫ‌స్ట్ తెలుగు సినిమా. ఇప్ప‌టివ‌ర‌కు హీరోగా, ల‌వ‌ర్ బాయ్‌గా ఎన్నో హిందీ సినిమాల్లో న‌టించిన ఇమ్రాన్.. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా విల‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇక ఈ సినిమాలో త‌మిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహ‌న్ (priyanka arul mohan) హీరోయిన్‌గా న‌టిస్తోంది. మూడో షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌ట్లు DVV ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్ర‌క‌టించింది. అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో 1950 బ్యాక్‌డ్రాప్‌తో ప‌వ‌న్ ఎంట్రీ సీన్‌ని షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.