Mental Health: మాన‌సికంగా బాగానే ఉంటున్నారా?

Hyderabad: సంపూర్ణ ఆరోగ్యం(Health) అంటే శరీరంతోపాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉండటం. అంటే మాససికంగానూ దృఢంగా, ప్రశాంతంగా ఉండాలి. చాలామంది శరీరంపై దృష్టి పెడతారు కానీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం(Mental Health) కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి(Stress), ఆందోళన శరీరం కంటే మనసుపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. తద్వారా రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే పాటించాల్సిన విషయాలేంటో చూద్దాం..
* మంచి నిద్ర మనసుకి ప్రశాంతతని చేకూరుస్తుంది. సెల్ ఫోన్(Mobile), టీవీ(TV) వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉంటే కచ్చితంగా మంచి నిద్రని పొందవచ్చు. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
* శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడాలి. ఒంటరిగా ఉన్న సమయంలో ఓ పుస్తకంలో మీకు నచ్చిన, ఇష్టమైన విషయాలు రాయడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే పాటలు వినడం, జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం, వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం వంటివి కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.