LSG: రూ.6.4 కోట్లు పెట్టి కొన్నా అతను ఆడలేని పరిస్థితి..!
LSG: ఈసారి ఐపీఎల్‌లో లఖ్‌నౌ సూపర్ జైంట్స్‌కు గట్టి షాక్ తగిలింది. బిడ్డింగ్ సమయంలో రూ.6.4 కోట్లు పెట్టి టీం శివమ్ మావేను కొనుగోలు చేసింది. స్టార్ పేసర్ అయిన మావే టీంలో లేకపోవడంతో పెద్ద లోపం అనే చెప్పాలి. అతని కాలికి గాయం కావడంతో ఈ మొత్తం ఐపీఎల్ సీజన్ నుంచే తొలగించాల్సి వచ్చింది.
“” ఈసారి టోర్నమెంట్‌ను చాలా మిస్సవుతాను. ఈసారి ఎలాగైనా ఆడతాను అనుకున్నాను కానీ గాయం వల్ల తప్పుకోవాల్సి వస్తోంది. ఈ సమయంలో ఏ ఆటగాడైనా ధైర్యంగా ఉండాలి. గాయం అయినప్పుడు దాని నుంచి కోలుకోవడానికి ప్రయత్నించి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి “” అని వెల్లడిస్తూ మావే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసాడు.
ఇప్పటివరకు కేఎల్ రాహుల్ (KL Rahul) సారథ్యంలో లఖ్‌నౌ సూపర్ జైంట్స్ మూడు ఆటలు ఆడగా.. వాటిలో రెండు గెలిచింది. పాయింట్స్ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఏదేమైనప్పటికి శివమ్ లేని లోటును 21 ఏళ్ల మాయంక్ యాదవ్ (Mayank Yadav) తీరుస్తున్నాడనే చెప్పాలి. ఫాస్టెస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించి ఆ తర్వాత తన రికార్డును తానే బ్రేక్ చేసాడు.