Kangana Ranaut MeToo: హీరోయిన్లను గదిలోకి పిలిపించుకుంటారు
Kangana Ranaut MeToo: ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా నేరుగా వ్యక్తపరిచే తత్వం కంగనా రనౌత్‌ది. అందుకే ఆమెను బాలీవుడ్ దూరం పెట్టింది. బాలీవుడ్‌కి చెందిన పెద్ద పెద్ద నటుల జాతకాలు బయటపెట్టిందన్న కోపంతో కంగన సినిమాలను బ్యాన్ చేయాలని ఫ్లాప్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమాను కూడా రిలీజ్ చేయనివ్వడంలేదు. ఈ నేపథ్యంలో కంగన మీటూ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. యాక్టర్లు హీరోయిన్లను తమ గదుల్లోకి పిలిపించుకుంటారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. సినిమాల గురించి మాట్లాడాలని పారితోషికం గురించి చర్చిద్దామంటూ యాక్టర్లు హీరోయిన్లను తమ ఇళ్లకు పిలిపించుకుంటారని.. అక్కడ వారి ద్వారా లైంగిక కోరికలు తీర్చుకుంటారని తెలిపారు.
“” యాక్టర్లు హీరోయిన్లను పాడు చేస్తుంటారు. రాత్రి డిన్నర్ పార్టీ ఉందని హీరోయిన్లకు మెసేజ్ చేస్తారు. వారు వెళ్తారు. ఇప్పుడు కలకత్తా రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చూడండి. నాకు కూడా రేప్ బెదిరింపులు వచ్చాయి. సినిమా రంగంలో ఈ లైంగిక వేధింపులు ఎక్కువగా ఉంటాయి. కాలేజీ అబ్బాయిలు ఆడవారిపై కామెంట్స్ చేస్తుంటారు. సినిమా హీరోలు తక్కువేం కాదు. మగాళ్లంతా ఒక్కటే “” అని వెల్లడించారు.
రేప్ చేస్తారు.. పని కల్పిస్తారు
Kangana Ranaut MeToo: ఈ సందర్భంగా కంగనా రనౌత్ దివంగత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అన్న వ్యాఖ్యలను గుర్తుచేసారు. యాక్టర్లు నటీమణులపై రేప్‌కి పాల్పడినా.. తర్వాత వారే పని కల్పించి వారు బతికేలా చేస్తారని సరోజ్ ఓ సందర్భంలో అన్నట్లు కంగన తెలిపారు. ఈరోజు చిత్ర పరిశ్రమలో ఆడపిల్లల భవిష్యత్తు ఇలాగే ఉందని అన్నారు.
Me Too మొదలైంది బాలీవుడ్లోనే
ఐదేళ్ల వరకు మీటూ అనే పదం ఎవ్వరికీ తెలీదు. నిజానికి మీటూ అనేది 2006లోనే మొదలైంది. న్యూయార్క్‌కి చెందిన తరానా బుర్కే అనే అడ్వొకేట్ ఈ మీటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి అన్యాయం గురించి బయటికి వచ్చి చెప్పాలని ప్రోత్సహించారు. కానీ అది ఇండియాకి మాత్రం వర్తించలేదు.
ఈ నేపథ్యంలో 2018లో తనుశ్రీ దత్తా అనే బాలీవుడ్ నటి తొలిసారి బయటికి వచ్చి మీటూ అంటూ తన పట్ల జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అలా తనుశ్రీ దత్తా శ్రీకారం చుట్టడంతో మెల్లిగా ఒక్కొక్కరూ బయటికి వచ్చి దారుణమైన విషయాలను వెల్లడించారు.
ఇక టాలీవుడ్ విషయానికొస్తే శ్రీరెడ్డి అర్థ నగ్న ప్రదర్శన చేసి రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు అంటూ రచ్చకెక్కింది. తన గోడు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఇలా రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వాపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ ఓ కమిటీ ఏర్పాటుచేసారు.
ఆ తర్వాత ఆమె పట్ల ఏం జరిగిందో అందరికీ విదితమే. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కాస్త కోలుకుంటోందేమో అనుకుంటున్న సమయంలో కేరళ చిత్ర పరిశ్రమ నుంచి హేమ కమిటీ రిపోర్టు అంటూ సంచలనం సృష్టించింది. మలయాళ చిత్రపరిశ్రమలో ఎందరో నటీమణులు సెక్సువల్‌గా బాధింపబడ్డారు అని ఆ రిపోర్టులో రాసుంది. ఈ రిపోర్ట్ ఐదేళ్ల క్రితమే బయటికి రావాల్సింది. మరి ఇప్పుడు ఎందుకు బట్టబయటు అయ్యిందో తెలీడంలేదు. ఇలాంటి ఒక రిపోర్టు బయటికి వచ్చిందని తెలీగానే వెంటనే చర్యలు చేపట్టాల్సిన మలయాళ చిత్ర పరిశ్రమ పెద్ద మోహన్‌లాల్.. తన పదవికి రాజీనామా చేసి చేతులు దులిపేసుకోవడం గమనార్హం.