మరో వివాదంలో సమంత.. అసలేం జరిగింది?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటారు. అయితే తాజాగా సమంత పోస్ట్ చేసిన ఒక ఫొటో, దానికి జతచేసిన క్యాప్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అదే పోస్ట్ వివాదానికీ దారి తీస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పలు సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. దైవారాధనలో మునిగిపోయినట్లుగా ఉన్న ఫోటో షేర్ చేసిన సమంత.. ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించింది. లింగ భైరవి దేవి అమ్మవారిని పూజిస్తున్న ఫొటోని షేర్ చేసి.. ‘జీవితంలో నమ్మకమే ప్రధానమైన బలం. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు.. నమ్మకమే మిమ్మల్ని మానవాతీతంగా చేస్తుంది’ అంటూ క్యాప్షన్ జతచేసింది సమంత. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సమంత చేస్తున్న పూజలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘సమంత క్రిస్టియన్ కదా? హిందూ మతంలోకి ఎప్పుడొచ్చింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సమంత క్రిస్టియన్ అన్న సంగతి తెలిసిందే. అయితే నాగచైతన్యతో పెళ్లి, విడాకుల క్రమంలో క్రమక్రమంగా హిందూ మతంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఛార్ ధామ్ యాత్ర చేయడం, గుడి మెట్లు ఎక్కుతూ మొక్కులు తీర్చుకోవడం అందరికీ తెలిసిందే. సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి అంటూ అప్పట్లోనూ చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత మతం మీద నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత తాజాగా పూజ గదిలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. నమ్మకం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు, ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు హిందూ మతంలోకి ఎప్పుడు మారిపోయింది? అసలు సమంత ఏ మతానికి చెందిన వ్యక్తి అంటూ ఆరాలు తీస్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలోనూ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్లోకి సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫొటోలూ బయటికొచ్చాయి. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదావేసి ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.