నేను టెర్మినేటర్‌ని: సర్జరీలపై రానా కామెంట్
సినీ నటుడు రానా దగ్గుబాటి చూడటానికి ఆరడుగులు, జిమ్ బాడీతో ఉంటాడు కానీ ఆరోగ్యపరంగా అతను ఎంతగా నలిగిపోయాడో తనకే తెలుసు. రానాకి ఒక కన్ను కనిపించదు అన్న సంగతి తెలిసిందే. కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత తను కేవలం ఒక కంటితోనే చూడగలుగుతున్నానని, అది అలవాటు చేసుకున్నానని అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ల గురించి నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను. ఓసారి నేను ఒక చిన్నారిని కలిసాను. వాళ్ల అమ్మకు కూడా కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అయిందట. దాంతో వాడు బాధగా కూర్చున్నాడు. అప్పుడు వాడికి నాకు కూడా ఒక కన్ను కనిపించదు అని నచ్చజెప్పాను. ఫిజికల్‌గా మన బాడీకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మనిషి డీలా పడిపోతాడు. సర్జరీతో అది ఫిక్స్ అయినా కూడా మనసులో ఏదో తెలీని బాధ ఉంటుంది. నాకు కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో పాటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా అయింది. అంటే నేను టర్మినేటర్ లాంటివాడిని అని తెలిపారు.